e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home హైదరాబాద్‌ నూతన మున్సిపల్‌ చట్టంతోసేవలు సులభతరం

నూతన మున్సిపల్‌ చట్టంతోసేవలు సులభతరం

చిక్కడపల్లి, ఆగస్టు4: నూతన మున్సిపల్‌ చట్టంతో సామాన్యులకు అందే సేవలు సులభతరంగా అందుతున్నాయని మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుల రాష్ట్ర ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ అన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో నూతన మున్సిపల్‌ చట్టం తీసుకురావడంతో పాటూ కో-ఆప్షన్‌ సభ్యులకు ప్రాధాన్యత లభించిన సందర్భంగా మున్సిపల్‌ కో-ఆప్షన్‌ సభ్యుల ఫోరం ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వానికి అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ సాధనలో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రజలకు అందుబాటులోకి ఉందే విధంగా నూతన మున్సిపల్‌ చట్టం తేవడం హర్షణీయమన్నారు. ఈ చట్టంతో టీఎస్‌ బీపాస్‌ ద్వారా సామాన్యులకు త్వరగా భవన నిర్మాణ అనుమతులు వస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యడు ఎర్రబెల్లి భాస్కర్‌ రెడ్డి, ఉపాధ్యక్షురాలు లత, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ శాస్త్రి, సంయుక్త కార్యదర్శి ఎండీ సలీం, బ్రహ్మన్నగౌడ, పెంటయ్య, సురేశ బాలయ్య, రాందాస్‌ గౌడ్‌, జగదీశ్‌, శోభారెడ్డి, శ్వేత ముఖేశ్‌, వెంకట్‌స్వామి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana