సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): పండుగ సీజన్ కోసం హోండా కార్స్ ఇండియా కొత్త వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో న్యూ హోండా అమేజ్ కారు రోడ్డెక్కనున్నది. ఈ కారులో ఫైన్ క్రోమ్ మోల్డింగ్ లైన్లు కలిగిన స్లీక్ సాలిడ్ వింగ్ ఫేస్ ఫ్రంట్ గ్రిల్, సిగ్నేచర్ డీఆర్ఎల్లు కలిగిన అధునాతన ఎల్ఈడీ ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్‌లు, కొత్త ప్రీమియం సీ ఆకారపు ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్‌లు, కొత్త డైమండ్ కట్ ఎల్లాయ్ వీల్స్, శాటిన్ సిల్వర్ ఎసెంట్లు కలిగిన అగ్రశ్రేణి ఇంటీరియర్లు ఇందులో ప్రత్యేకతలు. మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్ రంగుతో ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టారు.కొత్త మల్టీ వ్యూ రియర్ కెమెరాను కలిగి ఉండడం విశేషం. 1.2లీటర్ల ఐ-వీటెక్ (పెట్రోల్), 1.5లీటర్ల సామర్థ్యం కలిగిన ఐ-డీటెక్ (డీజిల్) సదుపాయం కలిగి ఉన్నది.