బుధవారం 27 జనవరి 2021
Hyderabad - Nov 29, 2020 , 08:00:47

ఇరవై ఏండ్లలో కాని పనులు 5 ఏండ్లలో చేశాం..

ఇరవై ఏండ్లలో కాని పనులు 5 ఏండ్లలో చేశాం..

 • నాచారం వంతెనతో వరద కష్టాలు పోయాయి.. 
 • పటేల్‌కుంట చెరువును సుందరీకరిస్తాం
 • ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తా 
 • నాచారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతిసాయిజెన్‌ శేఖర్‌ 

నాచారం డివిజన్‌లో 20 ఏండ్లలో చేయని పనులు ఐదేండ్లలో పూర్తయ్యాయి. ప్రజలకిచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను  కూడా పూర్తి చేశాం. ప్రజా సమస్యలు తీర్చేందుకే అధికారపార్టీలోకి వచ్చిన. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ ప్రభుత్వంలో ఉండాలి. మీ నమ్మకాన్ని నిలబెడుతా..ప్రతిపక్షాలకు ఓటు వేసి వృథా చేసుకోవద్దు..ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు చేసి, గ్రేటర్‌లో నాచారం డివిజన్‌ సత్తా చాటి చెబుతాం. ప్రతిపక్షాల సాధ్యం కాని హామీలతో మోసపోకండి..అధికారంలో లేనివారు ఇచ్చే గాలిమాటలు, హమీలు నమ్మవద్దు. నాచారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శాంతిసాయిజెన్‌ శేఖర్‌తో ముఖాముఖి.. 

నమస్తేతెలంగాణ : గడిచిన ఐదేండ్లలో డివిజన్‌ కోసం ఏం చేశారు ? 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : ఐదేండ్లలో డివిజన్‌ పరిధిలో చాలావరకు సమస్యలు పరిష్కరించాం. 20 ఏండ్లుగా వరదనీటితో ఇబ్బందిపడే నాచారం వాసులకు వంతెన నిర్మించి ప్రధాన సమస్య తీర్చాం. మూడునెలలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చి వీరారెడ్డినగర్‌, అంబేద్కర్‌నగర్‌, న్యూఅంబేద్కర్‌నగర్‌, భవానీనగర్‌, రాఘవేంద్రనగర్‌, ఇందిరానగర్‌ తదితర ప్రాంతాల వారి ఇక్కట్లు తొలగించాం. బ్రిడ్జి నిర్మాణం ఎంతో సంతృప్తినిచ్చింది. డ్రైనేజీ పైపులైన్లను రీమోడలింగ్‌ చేశాం. పెద్ద పైపులైన్ల వేసి మురుగునీటి సమస్య తీర్చాం. రెండు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశాం. స్నేహపురి రిజర్వాయర్‌ ద్వారా డివిజన్‌లో లోప్రెషర్‌ లేకుండా ఫీడర్లు తీసుకొచ్చాం.   

నమస్తే తెలంగాణ : డివిజన్‌లో ప్రధాన సమస్యలు ఏమిటి ?  ఎలా పరిష్కరించారు ? 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : నాచారం వంతెన నిర్మాణం పూర్తయ్యింది. దోమల సమస్య నివారణకు మంత్రి కేటీఆర్‌ సహకారంతో పటేల్‌కుంట, హెచ్‌ఎంటీనగర్‌ చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించాం. హెచ్‌ఎంటీనగర్‌ పెద్దచెరువును రూ.3.14కోట్లతో సుందరీకరిస్తున్నాం. పెద్దచెరువును మినీట్యాంక్‌బండ్‌గా చేయనున్నాం. సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే యంత్రాన్ని తయారు చేయించి, డివిజన్‌లో ఫాగింగ్‌ చేయిస్తున్నాం

నమస్తేతెలంగాణ : ప్రజలకు మీరిచ్చే హామీలు ?  

కార్పొరేటర్‌ అభ్యర్థి : టీఆర్‌ఎస్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఇంటికి నల్లాబిల్లును శాశ్వతంగా మాఫీ చేయబోతున్నాం. ఇంటిపన్నులో 50 శాతం రాయితీ ఇస్తున్నాం. త్వరలో రూ.5.5 కోట్లతో పటేల్‌కుంట చెరువును సుందరీకరిస్తాం. 

నమస్తేతెలంగాణ : కరోనా, వరదల సమయంలో ఎలా ఆదుకున్నారు ? 

కార్పొరేటర్‌ అభ్యర్థి : డివిజన్‌లో 6 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. సరుకుల పంపిణీకి సహకారమందించిన వారికి రుణపడి ఉంటాం. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపటి వరదనీటి తొలగింపు చేపట్టాం. అర్హులైన వరద బాధితులకు రూ.10 వేలు  చొప్పున దాదాపు 4 వేల కుటుంబాలకు ఇచ్చాం. ఇంకా రానివారుంటే ఎన్నికల ముగియగానే తప్పకుండా అందిస్తాం. 

నమస్తే తెలంగాణ : వరదనీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారు ?  

కార్పొరేటర్‌ అభ్యర్థి : ఎర్రకుంట ప్రాంతంలో వరద సమస్య పరిష్కారానికి పటేల్‌కుంట సమీపంలో రూ.54 లక్షలతో బాక్స్‌కల్వర్టు నిర్మాణం చేపట్టగా పూర్తి కావొస్తున్నది. న్యూ అంబేద్కర్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, కార్తీకేయనగర్‌, బాబానగర్‌లలో వంతెనల నిర్మాణానికి సుమారు రూ.2.5 కోట్లు వెచ్చించి పూర్తి చేస్తాం. నాలా రిటైనింగ్‌ వాల్‌ను రూ.96 లక్షలతో పటేల్‌కుంట చెరువు నుంచి హెచ్‌ఎంటీనగర్‌ చెరువు వరకు నిర్మిస్తాం. ఇందిరానగర్‌లో డ్రైనేజీ సమస్య రాకుండా నాచారం నుంచి చిలుకానగర్‌ వరకు డ్రైనేజీ పైపులైన్లు ఏర్పాటు చేశాం. డివిజన్‌ సమగ్రాభివృద్ధికి రూ.60 కోట్ల మంజూరు చేయించాం. ఇటీవల రూ.11 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం. 

నమస్తే తెలంగాణ : మీకే ఎందుకు ఓటు వేయాలి ? 

కార్పొరేటర్‌ అభ్యర్థి : ఎన్నికలు వచ్చినప్పడే కనిపించే నాయకులను ప్రజలు నమ్మరు. టీఆర్‌ఎస్‌లో మొన్నటివరకు ఉన్న అభ్యర్థి కాంగ్రెస్‌లోకి వెళ్లి ఓటు అడుగుతున్నారు. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి చేయగలుతాం. గడిచిన 5 ఏండ్లలో ప్రభుత్వం చేపట్టిన పనులు, సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నాం. గతంలో కాంగ్రెస్‌లో ఉండి గెలిస్తే పనులు చేయలేకపోయాను. అధికార పార్టీలో చేరాకనే అభివృద్ధి చేయగలిగాను. ఓటరు దేవుళ్లను కోరుతున్న..ఆలోచించి ఓటు వేయండి. 

చేపట్టిన అభివృద్ధి పనులు

 • నాచారం వంతెన నిర్మాణం   
 • బస్తీ దవాఖాన ఏర్పాటు     
 • రూ.3.14 కోట్లతో.. హెచ్‌ఎంటీనగర్‌ చెరువు సుందరీకరణ   
 • ఇందిరానగర్‌లో వరదనీటి కాల్వల నిర్మాణం  
 • దోమల నివారణకు స్ప్రే యంత్రం కొనుగోలు   
 • చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు    
 • పటేల్‌కుంట చెరువు వద్ద బాక్స్‌ కల్వర్టు నిర్మాణం     
 • డ్రైనేజీ పైపులైన్ల రీమోడలింగ్‌    
 • పెద్ద పైపులైన్లు నిర్మించి మురుగునీటి సమస్య పరిష్కారం.    
 • లోప్రెషర్‌ లేకుండా సాఫీగా తాగునీటి సరఫరా  
 • డివిజన్‌ సమగ్రాభివృద్ధికి రూ.60 కోట్లు మంజూరు     

డివిజన్‌ మ్యానిఫెస్టో..

 • రూ.5.5 కోట్లతో పటేల్‌కుంట చెరువు సుందరీకరణ  
 • రాఘవేంద్రనగర్‌, ఇందిరానగర్‌లో మరో బస్తీదవాఖాన ఏర్పాటు
 • పటేల్‌కుంటలో బాక్స్‌కల్వర్టు నిర్మాణం
 • న్యూఅంబేద్కర్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, కార్తికేయనగర్‌, బాబానగర్‌లలో బ్రిడ్జిల నిర్మాణం
 • పటేల్‌కుంట నుంచి హెచ్‌ఎంటీనగర్‌ చెరువు వరకు నాలా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం   
 • ఇందిరానగర్‌లో డ్రైనేజీ లైన్ల సమస్య తీరుస్తాం.  
 • దోమలపై యుద్ధం..సాయిజెన్‌ సిద్ధం నినాదంతో పనిచేస్తాం
 • ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
 • పారిశ్రామిక ప్రాంత కాలనీ వాసుల సమస్యలు తీరుస్తాం.  
 • బస్తీలు, కాలనీల సమగ్రాభివృద్ధికి చర్యలు  


logo