సోమవారం 06 జూలై 2020
Hyderabad - May 30, 2020 , 04:25:12

వలస కార్మికులకు న్యాక్‌ ఆధ్వర్యంలో శిక్షణ

వలస కార్మికులకు న్యాక్‌ ఆధ్వర్యంలో శిక్షణ

హైదరాబాద్  :  ఉపాధిని వెతుక్కుంటూ బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లి కరోనా భయంతో తిరిగొచ్చిన తెలంగాణ కార్మికులకు న్యాక్‌ శిక్షణతో పాటు ఉపాధిని కల్పిస్తున్నది. సుమారు 200 మంది కూలీలు తిరిగిరాగా వీరందరికీ శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ న్యాక్‌ సిద్ధమైంది. జిల్లాల్లో న్యాక్‌ అధికారుల బృందాలు, పట్టణాభివృద్ధి సంస్థలు, సంక్షేమశాఖల నుంచి వివరాలు సేకరిస్తూ కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాయి.  నేషనల్‌ అకాడమి ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌) వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. విదేశాల్లో భవన నిర్మాణ రంగంపై అవగాహన, అందులో పనిచేసిన అనుభవం ఉన్న వారికి మన అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇచ్చి వారికి మంచి వేతనంతో ఉపాధి కల్పించనున్నారు. అయితే ముందుగా వీరిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. క్వారంటైన్‌ సమ యం ముగిశాక వీరిని విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిసింది. 


logo