సోమవారం 06 జూలై 2020
Hyderabad - May 30, 2020 , 04:14:14

మహిళ మృతిపై వీడని మిస్టరీ

మహిళ మృతిపై వీడని మిస్టరీ

గోల్నాక: అనుమానాస్పద స్థితిలో  మహిళ మృతి చెందిన ఘటనలో ఇంకా మిస్టరీ వీడలేదు. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోల్నాక సెంట్‌ అంబర్‌ స్కూల్లో గత గురువారం ఓ మహిళ (36) మృతదేహం కుళ్లి పోయిన స్థితిలో లభ్యమైంది.  మృతదేహం పూర్తిగా కుళ్లి పోయిన స్థితిలో ఉండటంతో నాలుగైదు రోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని అంచనా వేశారు. అయితే శుక్రవారం మహిళ మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టు మార్టం నిర్వహించారు.

  ఫోరెన్సిక్‌ వైద్యుల ప్రాథమిక నివేదికలో  ఆమె హత్య, లైంగికదాడికి గురైనట్లు గానీ ఎలాంటి  ఆధారాలు లభించలేదు. అనారోగ్యంతో బాధపడుతూ శ్వాసకు సంబంధించిన వ్యాధితో మృతి చెందిందని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.  గేటుకు తాళం వేసిన పాఠశాలలోకి ఆమె ఎలా వెళ్లింది అనే కోణంతో ఇటీవల పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో అదృశ్యమైన కేసుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నా ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు. ఎవరైనా బాధిత మహిళను గుర్తుపడితే అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు. 


logo