మూసీ సుందరీకరణ భేష్

మూసీ పరీవాహక పాంతాల్లో మంగళవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్ వికాస్రావ్ అప్జల్ పుర్కర్, సభ్యురాలు పూర్ణిమ పర్యటించారు. ఎంఆర్డీసీఎల్ ఛైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, పీసీబీ చీఫ్ ఇంజనీర్ నగేష్, ఎంఆర్డీసీఎల్ ఎండీ విశ్వజిత్ కంపాటి, ఎంఆర్డీసీఎల్ చీఫ్ ఇంజనీర్ మెహన్నాయక్లు మూసీ సుందరీకరణ,అభివృద్ధి పనులను ఎన్జీటీ బృందానికి వివరించారు. సుందరీకరణ పనులపై ఎన్జీటీ బృందం సంతృప్తి చెందింది. పనులు ఇంకా వేగవంతం చేయాలని, మూసీలో పేరుకుపోయిన చెత్తాచెదారం ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఎంఆర్డీసీఎల్ సమన్వయంతో చక్కగా పనిచేస్తున్నాయని కితాబిచ్చింది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు స్పష్టమైన ఆలోచన ఉన్నదని, ఆ ఆలోచన మేరకే పనులు నిర్వహిస్తున్నామని సంస్థ చైర్మన్ సుధీర్‌రెడ్డి చెప్పారు. మూసీ చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పార్కు, పార్కింగ్ వసతి, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని, మూసీలో బోటులో ప్రయాణించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. డిప్యూటీ కలెక్టర్ మాలతి, ఓఎస్డి రామచంద్రారెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చాదర్‌ఘాట్ వంతెన వద్ద పరిశీలన
మాదన్నపేట : మూసీనది పరీవాహక ం చుట్టూ పచ్చదనం పెంచేందుకు చేస్తు న్న పనులను త్వరగా పూర్తి చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ సభ్యులు సూచించారు. చాదర్‌ఘాట్ వంతెన చుట్టూ జరుగుతున్న గ్రీనరీ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. వారి వెంట హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు శ్వేతా మహంతి, అమోయ్‌కుమార్, ఎంఆర్డీసీ ఎండీ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఐటీ రిటర్న్ ఇంకా పొందలేదా..? ఇలా చేయండి..
- బాలిక బలవన్మరణం
- ఉగాది నాటికి గ్రేటర్ వరంగల్వాసుల ఇంటింటికి మంచినీరు
- గంగూలీ చెకప్ కోసమే వచ్చారు: అపోలో
- 13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
- ‘ఎన్నికల విధులకు భంగం కలిగిస్తే కోర్టుకు వెళ్తాం’
- కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డెంటిస్ట్‌కు అస్వస్థత
- ట్రాక్టర్ ర్యాలీ: 550 ట్విట్టర్ ఖాతాల సస్పెన్షన్!
- వరుణ్, నటాషా వెడ్డింగ్ : తాజా ఫోటోలు వైరల్
- వంటిమామిడి మార్కెట్‌యార్డును సందర్శించిన సీఎం కేసీఆర్