30.5.2021 నుంచి 5.6.2021 వరకు
మేషం
తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితులు, ఆత్మీయులతో పనులు కలిసివస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వాహనం వల్ల పనులు పూర్తవుతాయి. నిత్య వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. కొన్ని విషయాలలో అనవసరమైన ఖర్చులు ఉంటాయి. వృత్తిరీత్యా, ఆదాయ పరంగా స్థిరంగా ఉంటుంది. ఉద్యోగంలో సంతృప్తి. నలుగురితో చర్చించడం వల్ల పనులు పూర్తవుతాయి. అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. అభీష్టాలను నెరవేర్చుకుంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బంది కొంత ఉంటుంది.
వృషభం
ఆరోగ్యం నయమవుతుంది. ఆహార నియమాలను పాటించడం అవసరం. స్నేహితులు, బంధువులతో వృథా ఖర్చులు ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పనులలో ఆటంకాలు ఉండవచ్చు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలం కాదు. నిర్ణయాన్ని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగ యత్నాలు కొనసాగుతాయి. ఉద్యోగంలో పై అధికారులతో సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు ఉండవచ్చు. స్నేహభావం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశం వుంది.
మిథునం
పనులలో అదృష్టం అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. సమాజంలో మంచివారి సాహచర్యం, కార్య సాఫల్యాన్నిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పూర్వం ఇచ్చిన డబ్బు కొంత తిరిగివస్తుంది. ఒక పక్కన ఆర్థిక సమస్య ఉన్నా పనులు పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితివల్ల కొన్ని పనులు వాయిదా పడవచ్చు. ఉద్యోగ యత్నాలు అనుకూలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. స్థానచలనం ఉంటుంది. ఆదాయం పూర్వంతో పోలిస్తే సంతృప్తికరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు ఉండవచ్చు. నియంత్రణ అవసరం. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త పనులు చేయడానికి ప్రయత్నిస్తారు.
కర్కాటకం
ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. తాత్కాలిక లాభాలను ఆశించి పనులు చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. వ్యాపార భాగస్వాములతో సామరస్యత, కార్యసాఫల్యం ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఎదురైనా పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. సమస్యలను పరిష్కరించుకోవడంపై మనసు పెడతారు. అనవసరమైన ఖర్చులు ఎదురుకావచ్చు. నియంత్రణ అవసరం. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులు సానుకూలంగా ఉంటాయి.
సింహం
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పూర్వం ఉన్న ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. స్నేహితులు, ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు ఈవారం అనుకూలంగా ఉంటుంది. ఉత్పాదన ఆశించిన దానికంటే సంతృప్తికరంగా ఉంటుంది. వివాహాది శుభకార్య యత్నాలు కలిసివస్తాయి. సంబంధాలు నిశ్చయమవుతాయి. ప్రయత్నాలు ఫలించి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
కన్య
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులవల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ పాటించండి. ఏకాగ్రత, పట్టుదలతో పనులు నిర్వహిస్తారు. అందరి సహకారాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. ఆలోచించి సమయానుకూలంగా పనులు నిర్వర్తిస్తారు. రావలసిన డబ్బు అనుకున్న సమయంలో అందక పోవడంతో పనులలో కొంత ఆలస్యం జరుగవచ్చు. ఆటంకాలతో కొంత అధైర్యానికి గురయ్యే అవకాశం ఉంది. విశ్వాసంతో పనులు చేయడం ముఖ్యం.
తుల
క్రమేపీ అనుకూలత ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ పెరుగుతుంది. చదువులో రాణిస్తారు. ప్రయత్నాలు ఫలించి, కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. రావలసిన డబ్బు ఆలస్యంగా అందడంతో కొన్ని పనులలో జాప్యం జరుగవచ్చు. అయినా, ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. సంతృప్తిగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. పెండ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి. ఉద్యోగస్తులకు తోటివారితో కొన్ని మనస్పర్ధలు ఉండవచ్చు. పై అధికారుల ఆదరణ బాగా ఉంటుంది. బంధువులు, సోదరుల సహకారంతో పనులు ముందుకు సాగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. పెద్దల సూచనలతో పనులు నెరవేరుతాయి.
వృశ్చికం
సమాజంలో మంచిపేరు ఉండటంతో కొన్ని పనులు అనుకూలిస్తాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. అన్ని విషయాలను సమగ్రంగా ఆలోచించి ఆచరణలో పెడతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పనులు పూర్తి కావడంలో ఆలస్యం ఉండవచ్చు. ఆదాయం స్థిరంగానే ఉంటుంది. క్రమేపీ పెరుగవచ్చు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పనులలో ఆటంకాల మూలంగా కొంత అధైర్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. పట్టుదల, ఏకాగ్రతతో ముందుకు వెళ్లడం ఈ వారం అవసరం. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. గౌరవ మర్యాదలతో సంతృప్తిగా ఉంటారు. పిల్లలు చదువులో రాణిస్తారు.
ధనుస్సు
ఆధ్యాత్మిక ప్రవచనాలపై మనసు నిలుపుతారు. మానసిక, శారీరక ఆనందంతో పనులు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. పనితనంతో ముందుకు వెళతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక పరమైన సమస్యలు, వృథా ఖర్చులతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సోదరులు, ఆత్మీయుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. అధికారుల ఆదరణకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆదాయం అనుకూలంగా ఉన్నా వృథా ఖర్చులు ఒక పక్కన ఉండటంతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కొన్ని విషయాలలో విభేదాలు కూడా కనబడుతున్నాయి. సమయాన్ని వృథా చేయకుండా పనులపై మనసు నిలుపుతారు.
మకరం
ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. ఒప్పందాలు చేసుకుంటారు. భాగస్వాములకు సిబ్బందితో మంచి అవగాహన ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగిస్తారు. కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురుకావచ్చు. నియమాలకు లోబడి పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులను ముందుకు తీసుకెళతారు. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు, నిర్మాణపు పనులు కలిసివస్తాయి. ఖర్చులు పెరిగినా పనులు పూర్తవుతాయి. పిల్లల చదువుకోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలద్వారా కార్యసాఫల్యం ఉంటుంది. స్నేహితులు, ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది.
కుంభం
శుభకార్యాలవల్ల ఖర్చులు ఉంటాయి. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఆఫీసులో తోటివారితో, పైఅధికారులతో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు. సామరస్యంగా ఉండటం చాలా అవసరం. అధికారుల ఆదరణకై ప్రయత్నిస్తారు. సంఘంలో మంచిపేరు తెచ్చుకుంటారు. సమాజహిత కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఖర్చులకోసం సర్దుబాట్లు అవసరం పడవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఉత్సాహంగా ఉంటారు. భార్యాపిల్లలతో హాయిగా గడుపుతారు. కోర్టు పనులలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. సంగీత, సాహిత్యకారులకు కలిసివస్తుంది.
మీనం
ప్రయత్నాలు ఫలించి ఉద్యోగంలో చేరతారు. కోర్టు వ్యవహారాలు, రాజకీయ, ప్రభుత్వ పనులు అనుకూలంగా పూర్తవుతాయి. స్థిర, చరాస్తుల వివాదాలు కొలిక్కివస్తాయి. వాటివల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో, సిబ్బందితో అవగాహన పెంపొందడంతో కార్యసాఫల్యత ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు. సంఘంలో మంచిపేరు ఉన్నవారితో సాహచర్యం ఉంటుంది. నలుగురికి ఉపయోగపడే పని చేస్తారు. ధార్మిక, సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. శుభకార్యాలు స్వయంగా చేయడం లేదా సహకరించడం వల్ల ఖర్చులు ఉండవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in