ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Hyderabad - Feb 24, 2021 , 04:48:24

కండ్లలో కారంచల్లి.. కత్తులతో దాడి

కండ్లలో కారంచల్లి.. కత్తులతో దాడి

  • చావుబతుకుల మధ్య బాధితుడు
  • పరారీలో నిందితులు 
  • నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన

అంబర్‌పేట, ఫిబ్రవరి 23 : కండ్లల్లో కారం చల్లి ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ  సంఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ మొగిలిచెర్ల రవి వివరాల ప్రకారం... నల్లకుంట, శంకరమఠం టెంపుల్‌కు ఎదురు లేన్‌లో ధీరజ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతడు వేరే దేశంలో ఎంబీబీఎస్‌ చదివి హైదరాబాద్‌కు వచ్చాడు. ఇతడికి ఇద్దరు భార్యలు. సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో నల్లకుంటలోని ఇంటి ముందు ఉండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కండ్లల్లో కారం చల్లి కత్తులతోదాడి చేశారు. కడుపు, వీపు, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విన్న ఇంటి మొదటి అంతస్తులో ఉన్న సోదరుడు ఫయాజ్‌ అహ్మద్‌ వచ్చి చూడగా ధీరజ్‌ అహ్మద్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 

వెంటనే దగ్గరలో ఉన్న ఆంధ్ర మహిళా సభ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు.. మెరురైన చికిత్స కోసం  హైదర్‌గూడ అపోలోకు పంపించారు.. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ అపోలో దవాఖానకు తరలించి చికిత్స చేస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు ఫయాజ్‌ అహ్మద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

VIDEOS

logo