శనివారం 23 జనవరి 2021
Hyderabad - Jul 22, 2020 , 00:05:16

మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌ పనులు ప్రారంభించాలి

మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌ పనులు ప్రారంభించాలి

డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌

సికింద్రాబాద్‌: అడ్డగుట్టలో రూ. 2.25 కోట్లతో నూతనంగా నిర్మించబోయే జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ ఆయన నివాసంలో తెలిపారు.  జీహెచ్‌ఎంసీ అధికారులను ఫోన్‌ద్వారా సంప్రదించి త్వరగా ఫంక్షన్‌హాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.  సీతాఫల్‌మండిలో కరోనా కేసులు అధికంగా ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గం ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. logo