ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:46:17

కదిలొస్తున్న మానవతామూర్తులు

కదిలొస్తున్న మానవతామూర్తులు

సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ: మానవతా మూర్తులు కదిలి వస్తున్నారు. కరోనా బారిన పడి విజేతలుగా నిలిచిన వారు ఇప్పుడు మరొకరి ప్రాణాలు నిలిపేందుకు ముందుకు వస్తున్నారు. పెద్ద ఎత్తున ప్లాస్మా దానం చేస్తున్నారు. అపోహలు, అనుమానాలు పక్కన పెట్టి విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రాణం పోస్తున్నారు. సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ చేపడుతున్న ప్లాస్మా దానం క్యాంపెయిన్‌కు భారీగా స్పందన వస్తున్నది. సోమవారం ఒక్కరోజే 20 మంది ప్లాస్మా దానం చేశారు. దీంతో ప్లాస్మా దానం చేసిన వారి సంఖ్య 317కు చేరింది. మరోవైపు 480 మంది విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారు. ప్లాస్మా దానం చేయాలనుకున్నా, ప్లాస్మా కావాలనుకునే వారు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ నెంబర్‌ 9490617440, రాచకొండ కొవిడ్‌ కంట్రోల్‌ నెంబర్‌ 9490617234లో సంప్రదించి రిజిస్టర్‌ చేయించుకోవాలని పోలీసులు తెలిపారు. 


logo