శుక్రవారం 23 అక్టోబర్ 2020
Hyderabad - Sep 21, 2020 , 00:49:39

కలిసికట్టుగా ముందుకు

కలిసికట్టుగా ముందుకు

మియాపూర్‌, సెప్టెంబరు 20 : కాలనీల అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు సాగాలని, తద్వారా మిగిలిన కాలనీలకు ఆదర్శంగా నిలువాలని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని వెంకట పాపయ్యనగర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించుకున్న కమ్యూనిటీహాల్‌ను కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌, అధ్యక్షుడు రామగిరి నాగేశ్వర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీకి సంబంధించిన సమస్యలు చర్చించుకునేందుకు సమావేశాలను నిర్వహించుకునేందుకు కమ్యూనిటీహాల్‌ ఎంతో వెసులుబాటును కల్పిస్తాయన్నారు.  కార్యక్రమంలో జిల్లా గణేశ్‌, రామకృష్ణ గౌడ్‌, కిషన్‌, శిరీష, కాలనీ అధ్యక్షుడు రామగిరి నాగేశ్వర్‌రావు, యాదగిరి, రామారావు, జనార్దన్‌, జంగారెడ్డి, ఆంజనేయులు, వేణు, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

 తులసీనగర్‌లో..

అల్విన్‌ కాలనీ డివిజన్‌ తులసీనగర్‌లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీహాల్‌ను కార్పొరేటర్‌ వెంకటేశ్‌గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే గాంధీ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గణేశ్‌, రామకృష్ణ గౌడ్‌, రాజేశ్‌చంద్ర, మధు, కిషన్‌, శిరీష పాల్గొన్నారు.

థీమ్‌ పార్కు పనుల పరిశీలన..

ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పీజేఆర్‌నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న థీమ్‌ పార్కును కార్పొరేటర్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థీమ్‌ పార్కును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వాకింగ్‌ట్రాక్‌, పచ్చని చెట్లు, ఓపెన్‌ జిమ్‌ వంటి వసతులను ఇందులో కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నేతలు జిల్లా గణేశ్‌, రామకృష్ణ గౌడ్‌ పాల్గొన్నారు.

 నిత్యావసర సరుకులు పంపిణీ..

మలబార్‌ గోల్డ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పీజేఆర్‌నగర్‌లో 500 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్‌ వెంకటేశ్‌గౌడ్‌తో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
logo