శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 08:19:49

వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

  • మౌలాలి డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకుల సస్పెన్షన్‌

మల్కాజిగిరి : వసూళ్లకు పాల్పడి ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. ఆర్థికసాయం పంపిణీలో వసూళ్లకు పాల్పడిన ముగ్గురు నాయకులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు మంగళవారం ఎమ్మెల్యే తెలిపారు. వరద సహాయం పంపిణీలో అవకతవకలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. డివిజన్‌ కార్యదర్శి చంద్రకాంత్‌, బుద్ధి నర్సింగ్‌రావు, నాగరాజులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. బాధితులందరికీ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వివరించారు.