e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home హైదరాబాద్‌ డ్రోన్‌ అస్త్రం.. క్యూలెక్స్‌ అంతం

డ్రోన్‌ అస్త్రం.. క్యూలెక్స్‌ అంతం

డ్రోన్‌ అస్త్రం.. క్యూలెక్స్‌ అంతం
 • మూసీ పరీవాహక ప్రాంతాల్లో దోమలపై బల్దియా యుద్ధం
 • డ్రోన్ల సహాయంతో మందుల పిచికారీ
 • ఫిర్యాదులతో కదలిన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం
 • సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
 • నివారణకు శాశ్వత చర్యలు

అసలే కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.. దోమలూ నగరవాసులను నిద్రపోనివ్వడం లేదు. గ్రేటర్‌లో క్యూలెక్స్‌ దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. మూసీలోని గుర్రపు డెక్క వాటికి ఆవాసంగా మారింది. దీంతో నది పరివాహక ప్రాంత ప్రజలు అటు కరోనాతో ఇటు ‘క్యూలెక్స్‌’తో అవస్థలు పడుతున్నారు. జ్వరాలు, ఫైలేరియా వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా పాజిటివ్‌ కేసులు ఉన్న ఇంట్లో ఇబ్బందులు వర్ణనాతీతం. హోం ఐసొలేషన్‌ ఉన్న వారికి కునుకు కరువు అవుతున్నది. ఈ నేపథ్యంలోనే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెలువెత్తాయి. రంగంలోకి దిగిన ఎంటమాలజీ విభాగం ప్రత్యేక డోన్ల సహాయంతో దోమల అంతానికి సిద్ధమైంది.

21 కిలోమీటర్ల పొడవునా..

మూసీ పరివాహక ప్రాంతాలైన బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు 21 కిలోమీటర్ల మేర గుర్రపు డెక్క తొలగిస్తున్నారు. ఆ ప్రాంతం పొడవునా నది రెండువైపులతో పాటు మధ్యలో కూడా దోమల మందు పిచికారీ చేస్తున్నారు.డ్రోన్లతో పాటు ఫ్లోటింగ్‌ ట్రాష్‌ కలెక్షన్‌, మౌంటెడ్‌ ఫాగింగ్‌ మిషన్లు, పోర్టబుల్‌ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఖైరతాబాద్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌ జోన్లలో బెడద ఉందన్న ఫిర్యాదుల మేరకు అదనపు సిబ్బందిని నియమించామని, దోమల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎంటమాలజీ చీఫ్‌ రాంబాబు తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీగా వ్యర్థాలను పారేయడం వల్లనే ఈ సమస్య మరింత అధికమైందని ఆయన వెల్లడించారు.

ఈ కారిడార్‌లలో యుద్ధ ప్రాతిపదికన మందుల పిచికారీ

ఖైరతాబాద్‌ జోన్‌ పురానాపుల్‌ (గోషామాహల్‌ డివిజన్‌) – ముస్లిం జంగ్‌ బిడ్జి (గోషామాహల్‌ డివిజన్‌) ముస్లిం జంగ్‌ బిడ్జి (బేగం బజార్‌ డివిజన్‌ – శివాజీ బిడ్జి (బేగం బజార్‌ డివిజన్‌) శివాజీ బిడ్జి (గన్‌ఫౌండ్రి డివిజన్‌) -చాదర్‌ఘాట్‌ సాయి బాబా టెంపుల్‌ (గన్‌ఫౌండ్రి డివిజన్‌) పురానాపుల్‌ (జియాగూడ డివిజన్‌) – శ్రీ హనుమాన్‌ టెంపుల్‌ (జియాగూడ డివిజన్‌) శ్రీ హనుమాన్‌ టెంపుల్‌ (జియాగూడ డివిజన్‌) – మోఘల్‌ ఖా నాలా (కార్వాన్‌ డివిజన్‌) మోఘల్‌ ఖా నాలా (కార్వాన్‌ డివిజన్‌) – రామ్‌దేవ్‌గూడ (లంగర్‌హౌజ్‌ డివిజన్‌)

చార్మినార్‌ జోన్‌ బాపుఘాట్‌ బిడ్జి (అత్తాపూర్‌ డివిజన్‌) – భరత్‌ నగర్‌ (అత్తాపూర్‌ డివిజన్‌) భరత్‌నగర్‌ (అత్తాపూర్‌ డివిజన్‌) – పురానాపుల్‌ బిడ్జి (పురానాపుల్‌ డివిజన్‌) పురానాపుల్‌ బిడ్జి (పురానాపుల్‌ డివిజన్‌) – శివాజీ బిడ్జి (పత్తర్‌ఘాట్‌ డివిజన్‌) శివాజీ బిడ్జి (పత్తర్‌ఘాట్‌ డివిజన్‌) – ఇమ్లిబన్‌ (డబీర్‌పురా డివిజన్‌) ఇమ్లిబన్‌ (డబీర్‌పురా డివిజన్‌) – చాదర్‌ఘాట్‌ (అజంపురా డివిజన్‌) చాదర్‌ఘాట్‌ (అజంపురా డివిజన్‌) – గోల్నాక (ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌) గోల్నాక (ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌) – మూసారాం బాగ్‌ (మూసారాం బాగ్‌ డివిజన్‌)

ఎల్బీ నగర్‌ జోన్‌ మూసారాంబాగ్‌ బ్రిడ్జి (మూసారాంబాగ్‌ డివిజన్‌) – భవానీనగర్‌ (కొత్తపేట్‌ డివిజన్‌) భవానీనగర్‌ (కొత్తపేట్‌ డివిజన్‌) – మారుతీనగర్‌ (కొత్తపేట్‌ డివిజన్‌) మారుతీనగర్‌ (కొత్తపేట్‌ డివిజన్‌) – నాగోల్‌ చెరువు ( నాగోల్‌ డివిజన్‌)

కార్యాచరణ ఇలా..

 • ఖైరతాబాద్‌, చార్మినార్‌, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌ జోన్ల పరిధిలో దోమల బెడదకు శాశ్వత చెక్‌
 • అదనపు సిబ్బంది నియామకం, 57 మంది వర్కర్లు మూడు బృందాలుగా విభజన.
 • ఇద్దరు అసిస్టెంట్‌ ఎంటమాలజీలు, మరో ఇద్దరు సీనియర్‌ ఎంటమాలజీల పర్యవేక్షణలో పనులు.
 • ఏడాదికి ఆరు మౌంటెడ్‌ ఫాగింగ్‌ మిషన్లు, 15 పోర్టబుల్‌ ఫాగింగ్‌ మిషన్లు అద్దె ప్రాతిపదికన వినియోగం.
 • మూడు మస్కిటో కిల్లింగ్‌ మిషన్లు.
 • అత్యధిక ఫిర్యాదులున్న బాపుఘాట్‌, లక్ష్మీనగర్‌ కాలనీ, జియాగూడ, అత్తాపూర్‌, ఉప్పల్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డ్రోన్‌ అస్త్రం.. క్యూలెక్స్‌ అంతం

ట్రెండింగ్‌

Advertisement