శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 24, 2020 , 01:40:39

దోమలపై దండయాత్ర

దోమలపై దండయాత్ర

ఎల్బీనగర్‌: సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితో దోమల నివారణకు ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. దోమల వ్యాప్తి నివారణ, ప్రజా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయన ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమానికి తోడుగా దీన్ని రూపొందించారు. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాబోయే వానకాలంలో దోమల స్వైరవిహారంతో వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. దోమలపై యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం నాగోల్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. గతేడాది వానకాలంలో విషజ్వరాలు, మలేరియా, డెంగీతో స్థానికులు దవాఖానల పాలై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో 2019 నవంబర్‌లో దోమల నివారణకు రోబోయే ఏడాదికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కార్యరూపంలోకి తెచ్చేందుకు సంకల్పించారు. 

జీహెచ్‌ఎంసీకి తోడు కార్పొరేటర్ల చేయూత..

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో దోమల నివారణ కోసం చేపడుతున్న కార్యాచరణకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నియోజకవర్గంలోని కార్పొరేటర్లను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కార్పొరేటర్ల ద్వారా 11 డివిజన్లకు గాను  ఒక్కో డివిజన్‌లో రెండు యాంటీలార్వా, రెండు ఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేయించారు.  ఎమ్మెల్యే స్వయంగా 11 ఫాగింగ్‌, 11 యాంటీలార్వా మిషన్లు కొనుగోలు చేసి ఆదివారం నుంచి అన్ని కాలనీల్లో దోమల నివారణ కోసం మందులు పిచికారీ చేయనున్నారు.


logo