మంగళవారం 26 మే 2020
Hyderabad - May 24, 2020 , 02:49:40

బీఎస్‌ 4 వాహనాల రిజిస్ట్రేషన్లు మరింత జాప్యం

బీఎస్‌ 4 వాహనాల రిజిస్ట్రేషన్లు మరింత జాప్యం

హైదరాబాద్  : బీఎస్‌ 4 వాహనాల రిజిస్ట్రేషన్లు మరింత జాప్యం కానున్నది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని మార్గదర్శకాలు ఉండటంతో రవాణాశాఖ అధికారులు త్వరితగతిన పూర్తిచేయాలని కసరత్తు చేశారు. అదే సమయంలో కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల వాహనాలు రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిచిపోయినట్లు తెలిసింది. 

బీఎస్‌ 4 వాహనాల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నందున మళ్లీ ఆదేశాలు అందేవరకు వాహన రిజిస్ట్రేషన్లకు స్లాట్లు కేటాయించకూడదని నిర్ణయించింది. అయితే దీనిపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ (మోర్త్‌) ఆదేశాలు అందితేనే బీఎస్‌ 4 వాహనాలకు అనుమతులు ఇవ్వాలని అధికారులు వేచిచూస్తున్నారు. బీఎస్‌ 6 వాహనాలను రిజిస్ట్రేషన్లకు అనుమతులు ఇస్తున్నప్పటికీ బీఎస్‌4వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగడం లేదు.


logo