ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Sep 05, 2020 , 01:05:41

చార్మినార్‌కు మరింత శోభ..

చార్మినార్‌కు మరింత శోభ..

రూ.1400 కోట్లతో అభివృద్ధి పనులు

చార్మినార్‌ అందాలు మరింత రమణీయతను సొంతం చేసుకోనున్నాయి. నాలుగు వందల ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడాన్ని తిలకించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. సందర్శకులు మరింత మధురానుభూతులు ఆస్వాదించడానికి సర్కార్‌ చార్మినార్‌ చుట్టూ మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.  చార్మినార్‌ ప్రాంతంలో పాదచారుల కోసం ప్రభుత్వం  రూ.1400 కోట్ల నిధులను కేటాయించింది. చార్మినార్‌ సీపీపీలో భాగంగా చార్మినార్‌కు దారి తీసే నాలుగు మార్గాల్లోనూ వాహనాల రాకపోకలను ఆగస్టు 18 నుంచి  పూర్తిస్థాయిలో నిషేధించింది. చార్మినార్‌కు దారి తీసే నాలుగు మార్గలైన ముర్గీచౌక్‌, సర్దార్‌ మహల్‌రోడ్డు, మదీనా, పంచ్‌ మహల్లా ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను విస్తరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. చార్మినార్‌ చుట్టూ 258 ప్రైవేట్‌ ఆస్తులను గుర్తించిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఇప్పటికే ఆయా భవనాల యజమానులకు నోటీసులు జారీ చేశారు.ముందస్తుగా రోడ్డు విస్తరణ పనులను పురాతనమైన కాలికమాన్‌ సమీపంలోని ఆగ్రా స్వీట్‌హౌస్‌ నుంచి ప్రారంభించనున్నారు.   -  చార్మినార్‌ 

 త్వరలో పనులు పూర్తి చేస్తాం

పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ పాతనగరానికి ప్రత్యేకతను అందించడానికి  సర్కార్‌ కృషి చేస్తున్నది. సీపీపీ పనులు పూర్తియిన తరువాత ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చార్మినార్‌ ఒకటి నిలువనుంది. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తిచేసుకున్నాయి.        - అశోక్‌ సామ్రాట్‌ , జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌


logo