మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 23:47:51

నిరాడంబరంగా ఎమ్మెల్యే గోపాల్‌ జన్మదినం

నిరాడంబరంగా ఎమ్మెల్యే గోపాల్‌ జన్మదినం

- పలు ప్రాంతాల్లో కేక్‌ కట్‌ చేసిన ఎమ్మెల్యే

- సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలు

చిక్కడపల్లి/ముషీరాబాద్‌/కవాడిగూడ/బషీర్‌బాగ్‌ : ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ జన్మదినాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్‌ డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు, స్థానిక కార్పొరేటర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ జన్మదినం ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ప్రారంభించారు. పార్టీ సీనియర్‌ నాయకుడు ముఠా నరేశ్‌, యువ నాయకుడు జైసింహ, శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, గుండు జగదీశ్‌, మారిశెట్టి నర్సింగ్‌రావు, ఆకుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. బాగ్‌లింగంపల్లి చౌరస్తా వద్ద తెలంగాణ హౌస్‌ఫెడ్‌  డైరెక్టర్‌ కిషన్‌రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదినంలో నాయకులు ఎం.దామోదర్‌రెడ్డి, కందూరి కృష్ణ, నాగభూషణం, రాజేంద్రప్రసాద్‌గౌడ్‌, సంతోష్‌గౌడ్‌ పాల్గొన్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు సి.కుమార్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. క్రాస్‌రోడ్స్‌లోని లక్ష్మీగణపతి ఆలయ చైర్మన్‌ ముచ్చకుర్తి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో పూజలు చేసి ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వాదం అందించారు. 

ముషీరాబాద్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు బిజ్జిరావన్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. మాజీ కార్పొరేటర్‌ సరిత, నాయకులు గోవింద్‌, బిజ్జి రవి, గాండ్ల ప్రసాద్‌, గణేశ్‌, రుద్ర ప్రవీణ్‌ పాల్గొన్నారు. రాంనగర్‌లో టీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.మోజెస్‌ ఆధ్వర్యంలో చీరెలు పంపిణీ చేశారు. ఇందిరాపార్కు చౌరస్తాలో ఎమ్మెల్యే పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కల్వగోపి, హనుమంతరావు, రాజశేఖర్‌గౌడ్‌ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలపారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో గోషాల వద్ద టీఆర్‌ఎస్‌ నాయకుడు యాదగిరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాల్గొని పేదలకు పండ్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ముకుందరెడ్డి, శ్యాం, ప్రభాకర్‌, జైసింహ, శ్రీనివాస్‌, శ్రీహరి, జమాలుద్దీన్‌, దుర్గాస్వామి పాల్గొన్నారు.

భోలక్‌పూర్‌ డివిజన్‌లోని పలు బస్తీలు, కాలనీల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. బొంతల బస్తీలో టీఆర్‌ఎస్‌ నాయకుడు భోలక్‌పూర్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, నవీన్‌కుమార్‌, మహ్మద్‌ అలీ, అబ్రహర్‌ హుస్సేన్‌ ఆజాద్‌ ఆధ్వర్యంలో ముషీరాబాద్‌ రెయిన్‌బో ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు, పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నగర నాయకుడు రవీంద్ర ఆధ్వర్యంలో పీఅండ్‌టీకాలనీలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు, రాంనగర్‌ కార్పొరేటర్‌ ముఠా పద్మ 100 మొక్కలను పంపిణీ చేశారు.


logo