ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూసే నిరుద్యోగుల మెరుగైన భవిష్యత్ కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్ నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశామని వెరిజాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విజయ రామన్ సుబ్రమణియన్ తెలిపారు. ఐటీ కారిడార్‌లోని మణికొండ ప్రభుత్వ పాఠశాలలో వెరిజాన్, నిర్మాణ్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్ వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ రామన్ మాట్లాడుతూ, మొబైల్ కౌన్సెలింగ్ ల్యాబ్‌లో వ్యక్తిగత, టెలీ కౌన్సెలింగ్ సర్వీసులు, సైకోమెట్రిక్ పరీక్షలు, సాంకేతికపరమైన మౌలిక సదుపాయాలు, మొబైల్ ఆప్లికేషన్లు ఇందులో ఉంటాయి. హెల్ప్‌లైన్ సేవలను అందిస్తామన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, యువతలో డిజిటల్ పరంగా ఏర్పడుతున్న అంతరాన్ని కలపడానికి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి వారు ఉజ్వలమైన భవిష్యత్తు అందిపుచ్చుకునేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మారుమూల గ్రామాల్లో ఉన్న వారు సైతం ఉద్యోగ అవకాశాలను పొందేలా చేసేందుకు నిరంతరం పనిచేస్తామన్నారు. మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం ఫోన్ (ట్రోల్ ఫ్రీ) నెం: 18004252429లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నిర్మాణ్ విద్యా హెల్ప్‌లైన్ సీఈఓ పి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.