మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 09:48:55

కష్టకాలంలో ప్రజల వెన్నంటి ఉంటాం

కష్టకాలంలో ప్రజల వెన్నంటి ఉంటాం

 అహ్మద్‌నగర్‌, అక్టోబర్‌26 : కష్టాల్లో ప్రజల వెన్నంటి ఉండేది టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని  ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ రావు అన్నారు. సోమవారం రెడ్‌హిల్స్‌ డివిజన్‌ చింతల్‌బస్తీ, శ్యామ్‌రావ్‌ నగర్లలో  నాంపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి సీహెచ్‌.ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి వరద బాధితులకు రూ.10 వేల ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వర్షాలతో వరద ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారందరికీ ప్రభుత్వ సాయం వర్తింపచేయాలని సూచించారు.   కార్యక్రమంలో రెడ్‌హిల్స్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అహ్మద్‌ అలీ,  నాయకులు పాల్గొన్నారు.

వరద బాధితులకు ఆర్థిక సహాయం 

  వర్షాలతో వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం బాధితులందరికీ వర్తింపచేయాలని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ మెరాజ్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. మాసాబ్‌ట్యాంక్‌ ఏసీ గార్డ్స్‌లో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం నాయకులతో కలిసి బాధితులకు రూ.10 వేల ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.   కార్యక్రమంలో నాయకులు అహ్మద్‌ అలీ, రవి ముదిరాజ్‌, నిజాముద్దీన్‌  పాల్గొన్నారు.

 ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

 మెహిదీపట్నం అక్టోబర్‌ 26 : ప్రజలను సకాలంలో ఆదుకోవడంలో  ప్రభుత్వం చేస్తున్న కృషితో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్‌ హుస్సేన్‌ అన్నారు. సోమవారం  మల్లేపల్లి డివిజన్‌లో వరద బాధితులకు ప్రభుత్వం తరుఫున రూ.10 వేలు సాయాన్ని బాధితులకు  అందజేశారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు ఇక్బాల్‌, వసీం  పాల్గొన్నారు.

  నాంపల్లి ఎమ్మెల్యేకు వృద్ధ మహిళ కృతజ్ఞత

 వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని నాంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాఫర్‌మెరాజ్‌ హుస్సేన్‌ అందజేస్తున్న సందర్భంలో ఓ వృద్ధ మహిళను ఆయన తలను అప్యాయంగా దగ్గరకు తీసుకుని  కృతజ్ఞత తెలిపారు. ఈ సంఘటనతో ఎమ్మెల్యేతో పాటు నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు.