టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ మీ వెంటే..

- ట్రస్మా ప్రతినిధులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..
- ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం
- హైదారాబాద్‌లో నేడు ప్రశాంత వాతావరణం...
- క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, కవాడిగూడ, నవంబర్ 23: టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు సోమవారం కవాడిగూడలోని కేమ్ బ్రిడ్జి గ్రామర్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ గల్లీ ఎన్నికలైనా ఢిల్లీ ఎన్నికలైనా టీఆర్ఎస్ పార్టీకి అండంగా ఉంటున్న ట్రస్మా కుటుంబ సభ్యులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సమస్యలపై టీఆర్ఎస్కు ఉన్నంత పట్టింపు మరే ఇతర పార్టీకి లేదని చెప్పారు. నీటిపన్ను రద్దు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేకూర్చే నిర్ణయం తీసుకున్నదని ప్రశంసించారు. బీజేపీ చేస్తున్న బూటకపు వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. కేసీఆర్ హామీలు ఇచ్చి తప్పించునే సీఎం కాదని చెప్పారు. ఆరు.. కారు.. సర్కారు అనే నినాదంతో ముషీరాబాద్‌లో ఆరు కార్పొరేట్ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ట్రస్మా సమస్యలను సీఎం కేసీఆర్ తప్పకుండా పరిష్కరిస్తారని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న వాతావరణం ఉండేదని ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఉందని చెప్పారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత కరెంట్, నల్లా బిల్లులను మాఫీ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. ముషీరాబాద్, అచ్చంపేట ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకం వర్గంలో ఆరు సీట్లను గెలుచుకొని తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ పార్టీ ఇంచార్జి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రావు, గాంధీనగర్ కార్పొరేటర్ అభ్యర్థి ముఠా పద్మా నరేశ్ ట్రస్మా హైదరాబాద్ జిల్లా ప్రతినిధులు మధుసూదన్ రావు, యాదగిరి శేఖర్ రావు, మంచాల రవి, ఉమామహేశ్వర్ రావు, సయ్యద్ భక్తియార్ పాల్గొన్నారు.
హుసేన్ సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్..
గత మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హుసేన్ సాగర్ నాలా వరద ముంపు సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయించి రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేయిస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం విలేకరులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత ఆరేళ్లలో ముషీరాబాద్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్లు తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో గాంధీనగర్ డివిజన్ ఇంచార్జిగా నాలా పరివాహక ప్రాంతాల బస్తీ వాసులకు నాలా రిటర్నింగ్ వాల్ నిర్మించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చామని...ఆ మేరకు 68 కోట్ల రూపాయలు ముంజూరు చేయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రహరీ నిర్మాణం చేపట్టడం వల్లనే ఇటీవల అరుంధతీనగర్‌లో వరద ముంపు సమస్య తలెత్తలేదని చెప్పారు. ముషీరాబాద్ చేపల మార్కెట్లో తలెత్తుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అజామాబాద్ పరిశ్రమల వాడలో స్థలాన్ని సేకరించి మోడల్ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆరింటిలో ఆరు స్థానాలు తమ పార్టీ సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
- మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు