గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:51:51

రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్షాసమావేశం

 రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్షాసమావేశం

 మియాపూర్‌ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కార్పొరేటర్లు సాయిబాబా, నాగేందర్‌యాదవ్‌, జగదీశ్వర్‌గౌడ్‌, దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌, జూపల్లి సత్యనారాయణ, జానకీరామరాజు, లక్ష్మీబాయి, నవతారెడ్డి, పూజితగౌడ్‌, హమీద్‌పటేల్‌, సింధుఆదర్శ్‌రెడ్డిలతో రెవెన్యూ సంబంధిత అంశాలపై శుక్రవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంపరిధిలోని రెవెన్యూ సమస్యలపై సమగ్ర సమాచారం సేకరించడంలో భాగంగా ఆయా డివిజన్లలోని రెవెన్యూ సంబంధిత సమస్యలపై స్థానిక కార్పొరేటర్ల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా   జీఓ నం 58, 59, తదితర రెవెన్యూ సమస్యలను శనివారం ఉదయం 10 గంటలకు జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

 మహిళలకు చేయూత.. అభినందనీయం.. 

  పేద మహిళలకు హోప్‌ ఫౌండేషన్‌ ద్వారా చేయూతనందించడం అభినందనీయమని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం  హోప్‌ఫౌండేషన్‌ చైర్మన్‌ కొండా విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్లను పేద మహిళలకు ఆయన నివాసంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్వర్‌షరీఫ్‌, మహేందర్‌, ఖాజా తదితరులు పాల్గొన్నారు.