e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home హైదరాబాద్‌ పేదలపై భారం తగ్గించేందుకు ఉచిత తాగునీరు

పేదలపై భారం తగ్గించేందుకు ఉచిత తాగునీరు

పేదలపై భారం తగ్గించేందుకు ఉచిత తాగునీరు

మైలార్‌దేవ్‌పల్లి, జూలై17 : జీహెచ్‌ఎంసీ పరిధిలోని పేదలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఉచితంగా నీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టిందని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. శనివారం మైలార్‌దేవ్‌పల్లి టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఉచిత నీటి పథకం బ్రోచర్‌ను హెచ్‌.ఎం. డబ్ల్యూ.ఎస్‌ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలపై తాగునీటి పన్ను బారం పడవద్దనే ఉద్దేశంతో ప్రతి ఇంటికీ నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆగస్టు 15 లోపు గృహ వినియోగదారులు ఆధార్‌ను అనుసంధానం చేసుకొని మీటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.మీటర్‌ ఏర్పాటు చేసుకున్న వారికి డిసెంబర్‌ 2020 నుంచి 31 ఆగస్టు 2021 వరకు 9 నెలల బిల్లు మినహాయింపు లభిస్తుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ జీఎం చంద్రశేఖర్‌ ,డీజీఎం జమీల్‌ , మేనేజర్‌ శ్రావ్య, సత్తార్‌ పాల్గొన్నారు.

నిరుపేదలను ఆదుకోవడం అభినందనీయం

బండ్లగూడ, జూలై 17 : నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గంధంగూడలో హెల్పింగ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్యావసర సరుకులను మేయర్‌ మహేందర్‌గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ పూలపల్లి రాజేందర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన హెల్పింగ్‌ ఫౌండేషన్‌ సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ తలారి చంద్రశేఖర్‌, టీఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్‌, రావులకోళ్ల నాగరాజు, పాండు, మాలాకిరత్నం, జగదీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదలపై భారం తగ్గించేందుకు ఉచిత తాగునీరు
పేదలపై భారం తగ్గించేందుకు ఉచిత తాగునీరు
పేదలపై భారం తగ్గించేందుకు ఉచిత తాగునీరు

ట్రెండింగ్‌

Advertisement