e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home హైదరాబాద్‌ కుర్చీలు విసిరేసి.. రభస చేసి

కుర్చీలు విసిరేసి.. రభస చేసి

  • జై శ్రీ రాం అని నినదిస్తూనే..
  • గుడిలో బీజేపీ నేతల విధ్వంసం
  • బోనాల చెక్కులు పంపిణీని జీర్ణించుకోలేక రసాభాస
  • పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన గొడవ

ముషీరాబాద్‌, కవాడిగూడ, జూలై 27: సాక్షాత్తూ అమ్మవారి ఆలయంలో బీజేపీ నేతలు విధ్వంసం సృష్టించారు. జై శ్రీరాం అంటూనే గుడిలో గొడవ రాజేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలో జరుగుతున్న చెక్కుల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆధ్యాత్మిక భావనతో జరగాల్సిన మంచి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితు లు సృష్టించారు. కమల నాథులు తెరలేపిన ఈ రసాభాస వివరాలు ఇ లా ఉన్నాయి. భోలక్‌పూ ర్‌ డివిజన్‌లోని దేవునితోట లో గల శ్రీ భవానీ శంకర్‌ దేవాలయంలో ఆషాఢ మాసం బోనా ల పండుగ సందర్భంగా మంగళవారం చెక్కుల పంపిణీ జరిగింది. ఇందుకు సంబంధించి.. నియోజకవర్గంలోని అటు టీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ కార్పొరేటర్లకు సమాచారం అందింది. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాష్ట్ర దేవాదాయ శాఖా సికింద్రాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ, భవానీ శంకర్‌ ఈఓ కృష్ణ, చైర్మన్‌ ఆర్‌. శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో బోనాల పండుగ చెక్కులను పంపిణీ చేస్తుండగా ముషీరాబాద్‌ బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఘర్షణ సృష్టించారు.

పిలిచినా..బీజేపీ కార్పొరేటర్లు రాలేదు

నియోజకవర్గంలో బోనాల ఉత్సవాలు జరుపుకునేందుకు ఎక్కువ సమయం లేనందున అన్ని డివిజన్లకు సంబంధించిన చెక్కులను ఒకే చోట ఒకే రోజు ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా మంగళవారం దేవుని తోటలోని శ్రీ భవానీ శంకర్‌ ఆలయంలో చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న బీజేపీ కార్పొరేటర్లు మాత్రం హాజరు కాకపోగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేసేందుకు తమ అనుచరులను, కార్యకర్తలను అక్కడికి పంపించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్లిపోయిన కొద్దిసేపటికే మిగతా చెక్కులను దేవాదాయ శాఖ అధికారులు పంపిణీ చేస్తుండగా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు అక్కడికి చేరుకుని విధ్వంసం సృష్టించారు. దేవాదాయ శాఖ అధికారులు ఎంత సముదాయించినా వినలేదు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ కుర్చీలు, బల్లలను విరగ్గొట్టారు. కార్యక్రమానికి హాజరైన టీఆర్‌ఎస్‌ నేతలపై దాడికి యత్నించారు. భవానీ శంకర్‌ ఆలయాన్ని రణరంగంలా మార్చారు. చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌, ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌ యాద వ్‌, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిలు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

బీజేపీ గూండాల్లారా ఖబడ్దార్‌…

- Advertisement -

ముషీరాబాద్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటని, ఇక నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీకే డిపాజిట్టుకూడా దక్కదని టీఆర్‌ఎస్‌ నేతలు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్‌, డి.శివముదిరాజ్‌, సయ్యద్‌ అస్లాం, హమ్మదుల్లా, వై.శ్రీనివాస్‌, శ్యామ్‌ యాదవ్‌లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్దికి కలిసి వస్తే తాము సహకరిస్తామని, అభివృద్దిని అడ్డుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. హిందువులుగా ఉండి హిందూ దేవాలయంలో బీజేపీ నాయకులు గొడవలకు దిగడం అత్యంత దారుణమని టీఆర్‌ఎస్‌ భోలక్‌పూర్‌ నేతలు బింగి నవీన్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాస్‌ రావు, ఆనంద్‌రాజ్‌లు అన్నారు. సామరస్యంగా బోనాల పండుగ చెక్కులు పంపి ణీ జరుగుతుండగా జీర్ణించుకోని బీజేపీ నాయకులు గొడవలకు దిగడం అవివేకమని అన్నారు. ఈ మేరకు మంగళవారం వారు భోలక్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొలేకనే గొడవలకు దిగుతున్నారని అన్నారు. హిందువు గా ఉండి హిందూ దేవాలయంలో రౌడీల్లా ప్రవర్తించడం సిగ్గుచేటని, జై శ్రీరాం అంటూ ఇలాంటి ఘర్షణలకు పా ల్పడడం సరైంది కాదని అన్నారు. హద్దుమీరితే ఎంతటివారినైనా సహించేది లేదని వారు హెచ్చరించారు. బీజేపీ గూండాల్లారా ఖబడ్దార్‌ అని వారు హెచ్చరించారు.

గుడి ఆస్తుల ధ్వంసం దిగజారుడు చర్య

బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ఆలయాలకు చెక్కులు పం పిణీ చేస్తుంటే.. రాజకీయ స్వార్థం కోసం కార్పొరేటర్‌లకు బదులు బీజేపీ కార్యకర్తలు వచ్చి డిమాం డ్‌ చేయడం, దాడులకు పాల్పడటం సిగ్గుచేటు. బో నాలకు ఎక్కువ సమయం లేనందునే ఒకే చోట అం దరికి చెక్కులు పంపిణీ చేస్తుంటే అడ్డుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. టీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ఫేస్‌ బుక్‌, వా ట్సాప్‌ లీడర్లు చివరికి బోనాల ఉత్సవాల ఏర్పాట్లను కూడా అడ్డుకుంటున్నారు. అభివృద్ది కార్యక్రమాల్లో ప్రతి కార్పొరేటర్‌ను భాగస్వామిని చేస్తున్నా, గొడవలకు దిగడం శోచనీయం. – ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

బీజేపీ నాయకుల పై కేసు నమోదు

దోమలగూడ, జులై 27 : చెక్కుల పంపిణీని అడ్డుకున్న బీజేపీ నాయకులపై ముషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు.. బోనాలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న ఆలయాల కోసం ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కులను భోలక్‌పూర్‌లో ఉన్న భవానీ శంకర్‌ ఆలయంలో ఈఓ కృష్ణ నిర్వాహకులకు అందజేస్తున్నారు. ఈ సందర్భంలో తమకు సమాచారం ఇవ్వలేదంటూ బీజేపీ నాయకులు ఆలయానికి వచ్చి దేవాదాయ శాఖ అధికారులతో ఘర్షణకు దిగి కూర్చీలను పడేశారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బీజేపీ నాయకులతో మాట్లాడారు. అయితే ఈ ఘటన పై ఈఓ కృష్ణ ముషీరాబాద్‌ పోలీసులకు బీజేపీ నాయకుల తీరుపై ఫిర్యాదు చేశారు. ఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana