e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home హైదరాబాద్‌ పైపులైన్‌ పనులు వెంటనే చేపట్టండి

పైపులైన్‌ పనులు వెంటనే చేపట్టండి

పైపులైన్‌ పనులు వెంటనే చేపట్టండి

ముషీరాబాద్‌, మే 24: రాంనగర్‌ డివిజన్‌ జెమినీ కాలనీ-చేపల మార్కెట్‌ రోడ్డులో డ్రైనేజీ పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టాలని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ జలమండలి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి జెమిని కాలనీలో పర్యటించి రోడ్డు పనులు నిలిచిపోవడానికి గల కారణాలను వాకబు చేశారు. రోడ్డును తవ్విన తరువాత డ్రైనేజీ పైపులైన్‌ ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో రోడ్డు పనులు నిలిపివేశామని, పైపులైన్‌ పనులు పూర్తి చేసిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం ఏఈ మురళీ ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు తెలిపారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డ్రైనేజీ పైపులైన్‌ పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం మహేశ్‌, మేనేజర్‌ హకిం, జీహెచ్‌ఎంసీ ఏఈ మురళీ, టీఆర్‌ఎస్‌ నాయకులు ముఠా జయసింహ, సుధాకర్‌గుప్తా, దామోదర్‌రెడ్డి, నేత శ్రీనివాస్‌, గోక నవీన్‌, ముదిగొండ మురళీ, ఎర్రం శేఖర్‌, మాధవ్‌, దీన్‌దయాల్‌రెడ్డి, శ్యామ్‌సుందర్‌, సయ్యద్‌ అస్లాం, నర్సింగ్‌ప్రసాద్‌, మోజస్‌, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పైపులైన్‌ పనులు వెంటనే చేపట్టండి

ట్రెండింగ్‌

Advertisement