e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home హైదరాబాద్‌ కాలనీల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం

కాలనీల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం

కాలనీల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం

అంబర్‌పేట, జూన్‌ 23: అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో సీసీ, బీటీ రోడ్లను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని జంజం మసీదు వద్ద రూ.12లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్‌ కార్పొరేటర్‌ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట తదితర డివిజన్ల పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఇప్పటికే సీసీ, బీటీ, వీడీసీసీ రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. సీసీ రోడ్లతో పాటు మంచినీటి, డ్రైనేజీ పైపులైన్లను కూడా ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను సైతం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఈఈ శంకర్‌, డీఈ సుధాకర్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీరాములుముదిరాజ్‌, మహేశ్‌, చంద్రమోహన్‌, శ్రీనివాస్‌, బాబు, సులోచన, బీజేపీ నాయకులు ఇ.అజయ్‌కుమార్‌, అచ్చిని రమేశ్‌, సురేశ్‌, దత్తు, రంగంపల్లి రాజు, టి.వెంకటేశ్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

గోల్నాక, జూన్‌ 23: నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ తెలిపారు. బుధవారం అంబర్‌పేట డివిజన్‌లోని రఘునాథ్‌నగర్‌లో రూ.6 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్‌ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు శంకర్‌, సంతోష్‌, శ్వేత, దుర్గాతో పాటు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కాలనీల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం
కాలనీల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం
కాలనీల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం

ట్రెండింగ్‌

Advertisement