e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home హైదరాబాద్‌ ముంపు ముప్పు తప్పిస్తాం

ముంపు ముప్పు తప్పిస్తాం

ముంపు ముప్పు తప్పిస్తాం
  • వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధులు
  • బాధితులకు భరోసా

ఎల్బీనగర్‌, జూలై 16 : ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని ముంపు ముప్పును తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం డివిజన్‌తో పాటుగా పలు డివిజన్లలో పర్యటించి వరద ముంపు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. గడ్డిఅన్నారం డివిజన్‌లోని ముంపు ప్రాంతాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తాను ఉన్నానంటూ వారికి బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తాత్కాలికంగా ముంపు సమస్య తీరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం కార్పొరేటర్‌ బద్దం ప్రేం మహేశ్వర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ కౌన్సిలర్‌ కందికంటి ప్రేంనాథ్‌గౌడ్‌, నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్‌రావు, తులసీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

మన్సూరాబాద్‌: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటున్న వరదనీటిని వెంటనే దిగువకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. భారీ వర్షాల వలన నిండుకుండలా మారిన బండ్లగూడ, నాగోల్‌ చెరువులతో పాటు అయ్యప్పకాలనీ, వెంకటరమణ కాలనీల్లో శుక్రవారం పర్యటించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ అధికారుల సహకారంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరదల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ హయత్‌నగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ మారుతీదివాకర్‌, నాయకులు చెరుకు ప్రశాంత్‌గౌడ్‌, అనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, చంద్రశేఖర్‌ ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం

- Advertisement -

హయత్‌నగర్‌: నియోజకవర్గం పరిధిలోని కాలనీల్లో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని రంగనాయకులగుట్ట, అంబేద్కర్‌నగర్‌ కాలనీల్లో మాజీ కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డితో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పర్యటించి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగనాయకులగుట్ట బ్యాక్‌ సైడ్‌ వరకు 15 ఫీట్ల వెడల్పు రూ.10 కోట్ల బడ్జెట్‌తో స్ట్రామ్‌ వాటర్‌డ్రైన్‌ అల్రెడీ టెండర్‌ దశలో ఉందని, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డివిజన్‌ పరిధిలోని హయత్‌నగర్‌లోని తిరుమల కాలనీ, షిర్డీనగర్‌ కాలనీ, ఆర్టీసీ మజ్దూర్‌ కాలనీ, కట్టమైసమ్మ కాలనీ, బంజరాకాలనీ, అంబేద్కర్‌నగర్‌ కాలనీ, రంగనాయకులగుట్ట కాలనీల్లో వరద ముంపు శాశ్వత పరిష్కారానిక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చెన్నగోని శ్రీధర్‌గౌడ్‌, మల్లీశ్వరి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కాప్రాయి చెరువు వరద మల్లించేందుకు కాలువ

వనస్థలిపురం: కాప్రాయి చెరువు నిండి, ముంపు ప్రమాదం ఉన్న తరుణంలో అధికారులు తాత్కాలిక కాల్వను తవ్వించారు. శుక్రవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీఎన్‌రెడ్డినగర్‌ కార్పొరేటర్‌ మొద్దు లచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి తదితరులు పనులను పరిశీలించారు.

వరదనీటి సమస్య విముక్తికి చర్యలు

మన్సూరాబాద్‌: వానకాలంలో హిమపురికాలనీ ఫేజ్‌-2లో తరచూ తలెత్తుతున్న వరదనీటి సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా చేరిన వరదనీటితో మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధి హిమపురికాలనీ ఫేజ్‌-2లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని తెలుసుకున్న ఆయన శుక్రవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహావీర్‌ హరిణ వనస్థలి నేషనల్‌ పార్కు నుంచి వస్తున్న వరదతో తరచూ హిమపురికాలనీ ఫేజ్‌-2లో ముంపు ఏర్పడుతుందని తెలిపారు. అటవీశాఖ అధికారులు నిర్మించిన ప్రహరీగోడ కూలిపోవడంతో వరదనీరు కాలనీలోకి చేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఈశ్వర్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారాం, కాలనీవాసులు బుచ్చిరెడ్డి, గఫార్‌, మాధవి, పవిత్ర, రంగనాయకమ్మ, రేణుక, శ్రీకాంత్‌, వసంత, హిమాంబి తదితరులు పాల్గొన్నారు.

సమస్య పరిష్కారానికి కృషి

హయత్‌నగర్‌: డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న వరద ముంపు సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు హయత్‌నగర్‌ కార్పొరేటర్‌ కళ్లెం నవజీవన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం డివిజన్‌ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌, బంజారాకాలనీ, వస్పరినగర్‌లో కార్పొరేటర్‌ నవజీవన్‌రెడ్డి పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

నిరాశ్రయులైన ప్రజలను ఆదుకుంటాం

మన్సూరాబాద్‌: కాలనీల్లోకి వరదనీరు చేరడంతో నిరాశ్రయులైన ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని నాగోల్‌ కార్పొరేటర్‌ చింతల అరుణ అన్నారు. లోతట్టు ప్రాంతమైన అయ్యప్పకాలనీ ప్రజల కోసం నాగోల్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించి అక్కడ ఉంటున్న ప్రజల యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం పునరావాస కేంద్రంలో ఉంటున్న ప్రజలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అయ్పప్ప కాలనీవాసులు సాధ్యమైనంత త్వరగా తమ ఇండ్లలోకి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు.

వరద సమస్యను పరిష్కరించండి

వనస్థలిపురం: ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఒక కాలనీకి వరదను రాకుండా ఆపేందుకు తమ పది కాలనీలను ముంపునకు గురిచేస్తున్నారని కాప్రాయి చెరువు వరద ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వరద సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో కాలనీల ప్రతినిధులు ఉమాకాంత్‌ తివారీ, అరవింద్‌గౌడ్‌, మహ్మద్‌ అన్సారీ, రామ్‌ గోపాల్‌ దాస్‌, సుధాకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముంపు ముప్పు తప్పిస్తాం
ముంపు ముప్పు తప్పిస్తాం
ముంపు ముప్పు తప్పిస్తాం

ట్రెండింగ్‌

Advertisement