e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home హైదరాబాద్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి
  • నాలాల అభివృద్ధికి రూ. 113 కోట్లు మంజూరు
  • నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలి
  • అధికారుల సమావేశంలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్‌, జూన్‌ 14: నియోజకవర్గంలోని నాలాల అభివృద్ధికి రూ.113 కోట్లు మంజూరు చేసిందని ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. సోమవారం గడ్డిఅన్నారం డివిజన్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషన్‌ర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎన్‌రెడ్డి డివిజన్‌ పరిధిలోని సాగర్‌ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న కాప్రాయి చెరువు నాలాల పనుల అలసత్వం వహించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులు పనులకు రాలేదని దీంతో పనులు నిలిచిపోయాయని, ఇప్పుడిప్పుడే కార్మికులు పనులకు వస్తుండడంతో పనుల్లో వేగం పెరుగుతుందని అధికారులు వివరణ ఇచ్చారు.

బైరామల్‌గూడ చెరువు అభివృద్ధి విషయంలో కాంట్రాక్టర్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఇరిగేషన్‌ డిప్యూటీ డీఈ పవన్‌కుమార్‌ను కూడా మందలించారు. నియోజకవర్గంలో నాలాల పనులను అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా నాలాలకు సంబంధించిన స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్స్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌ఎన్‌డీపీ చీఫ్‌ ఇంజినీర్‌ వసంత, జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, సుభాని, ఇరిగేషన్‌ శాఖ, ప్రాజెక్టు అధికారులు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి
పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి
పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

ట్రెండింగ్‌

Advertisement