మల్లాపూర్/చర్లపల్లి/రామంతాపూర్, ఆగస్టు 5 : తెలంగాణ ఉద్యమకారుడు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్లో గురువారం జరిగిన బేతి సుభాష్‌రెడ్డి జన్మదిన వేడుకలకు ఆయన హాజరై పుష్ప గుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, శాంతి సాయిజన్‌శేఖర్, స్వర్ణరాజు, బొంతు శ్రీదేవి, జెర్రి పోతుల ప్రభుదాస్, బన్నాల గీత, సామల హేమ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
చర్లపల్లి, ఏఎస్‌రావునగర్ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాచారంలోని మానసిక వికలాంగల ఆశ్రమంలో మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కేక్ కట్ చేసి వికలాంగులు, వృద్ధులకు భోజనం అందజేశారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మాజీ కార్పొరేటర్లు పావనీమణిపాల్‌రెడ్డి, కొత్త రామారావు, సీనియర్ నాయకుడు కాసం మహిపాల్‌రెడ్డి, బేతాల బాల్‌రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గిరిబాబు, రెడ్డినాయక్, సత్యనారాయణ, చంద్రమౌళి, రమేశ్, వెంకటేశ్, కపిల్‌రెడ్డి, హనుమంత్‌రావు పాల్గొన్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్ , రామంతాపూర్ డివిజన్ అధ్యక్షుడు సర్వబాబు యాదవ్, గంగిడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సేవలో ఉంటూ ఉప్పల్ నియోజక వర్గ సమగ్ర అభివృద్ధికి తాను కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాలకూర శ్రీకాంత్‌గౌడ్, సూరంశంకర్, సాంబశివరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను ఆశీర్వదించిన అర్చకులు ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా రామంతాపూర్ మల్లి కార్జున స్వామి దేవాలయం చైర్మన్ ముట్కూరి దయాకర్‌రెడ్డి, అర్చకులు శేఖర్‌బాబు శర్మలు స్వామి ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.