ముంపు లేకుండా.. ముందుకు సాగేలా..

ఉప్పల్, జనవరి 7 : సుదీర్ఘకాల సమస్యలకు మోక్షం లభించనున్నది. వరద ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారు. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు మార్కింగ్ మ్యాప్ సిద్ధం చేశారు. వీటికోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే హోంమంత్రి మహమూద్ ఆలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, అధికారులు పర్యటించి చెరువులను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వరదముంపు నివారణలో భాగంగా ముందుగా చేపట్టనున్న పనుల్లో ఉప్పల్ ప్రాంతం కూడా ఉంది. ఇక్కడి రామంతాపూర్ పెద్దచెరువు, చిన్నచెరువు ప్రాంతాల్లో ముంపు నివారణ కోసం పైలెట్ ప్రాజెక్టు కింద పనులు చేపట్టాలని నిర్ణయించారు.
వరదనీరు సాఫీగా వెళ్లేందుకు పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు ఎల్బీనగర్ జోన్ పరిధిలో వరద సమస్యల పరిష్కారానికి రూ. 698.93 కోట్లు కేటాయించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హబ్సిగూడ, రామంతాపూర్‌లో వరదనీటి నివారణ కోసం రూ.264.66 కోట్లతో పనులు చేపట్టనున్నారు. వీటితోపాటు క్యాచ్మెంట్ల సమస్యలు కూడా పరిష్కరించనున్నారు. పెద్ద చెరువు నుంచి చిన్నచెరువు ద్వారా మూసీలోకి వరదనీరు వెళ్లేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రామంతాపూర్ పెద్దచెరువు నుంచి చిన్నచెరువు వరకు కాలువను నిర్మించి, అక్కడ నుంచి నేరుగా మూసీలోకి వరద వెళ్లే విధంగా కాలువలు నిర్మించనున్నారు. వీటికోసం మార్కింగ్ చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు.
వరద సమస్యకు శాశ్వత పరిష్కారం
వరదనీటి సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపడుతున్నాం. వీటికోసం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాం. హబ్సిగూడ, రామంతాపూర్ ప్రాంతాల్లో వరదనీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్‌లో వరదనీరు, ముంపు సమస్యలు లేకుండా చూస్తాం. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. - బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే
పెద్దచెరువు ముంపు సమస్యలు తీరుతాయి..
రామంతాపూర్ పెద్దచెరువు సమస్యలు తీరుతాయి. వరదముంపు ఇబ్బందులు లేకుండా చూస్తాం. వీటికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. హబ్సిగూడ పరిసర ప్రాంతాల ప్రజలు వరదముంపునకు గురికాకుండా తగిన ప్రణాళికలు రూపొందించి.. పనులు చేపడుతున్నారు. భవిష్యత్‌లో రవీంద్రనగర్, లక్ష్మీనగర్, సాయిచిత్రనగర్ ప్రాంతాల్లో వరదనీటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. - బేతి స్వప్నారెడ్డి, కార్పొరేటర్, హబ్సిగూడ
తాజావార్తలు
- నీవి ఎల్లప్పుడూ సాస్తీ వ్యాఖ్యలే: తాప్సీపై కంగన ఫైర్
- అక్షర్.. ఆ సన్‌గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయ్
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు