e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 25, 2021
Home హైదరాబాద్‌ ఆర్‌ఓబీ పనులు త్వరలో పూర్తి

ఆర్‌ఓబీ పనులు త్వరలో పూర్తి

చర్లపల్లి, మార్చి 23 : చర్లపల్లి డివిజన్‌ భరత్‌నగర్‌ రైల్వే క్రాసింగ్‌ ఆర్‌ఓబీ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించి, అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి ఆర్‌ఓబీ బ్రిడ్జి పనులకు సంబంధించి నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లిన సందర్భంగా చర్లపల్లి మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేండ్లుగా చర్లపల్లి వాసులు ఎదుర్కొంటున్న సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది నిధులు కేటాయించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఓబీ బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం నాయకులు దర్శనం బాలయ్య, కడియాల కుమార్‌, కొమ్ము రమేశ్‌, కొమ్ము సురేశ్‌, కడియాల అనిల్‌కుమార్‌, బొజ్జ కృష్ణ, పందిగారి శ్రీనివాస్‌, డప్పు సతీశ్‌, కొమ్ము అశోక్‌, దర్శనం సుఖేందర్‌, డప్పు శంకర్‌, సీహెచ్‌.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాలనీల అభివృద్ధికి కృషి..
నియోజకవర్గం పరిధిలోని కాలనీలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఉప్పల్‌ నియోజకవర్గం మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహ్మద్‌ బాజీబాషాను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బేతాల బాల్‌రాజు, నాయకులు మణిపాల్‌రెడ్డి, ఎస్‌కే.కరీం, గరిక సుధాకర్‌లతో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం..
మల్లాపూర్‌, మార్చి 23 : పేద, మధ్య తరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎంతో ఆసరగా నిలుస్తుందని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మల్లాపూర్‌కు చెందిన దాసరి సుమిత్ర, గంగమ్మ అనారోగ్యంతో వైద్య శాలలో చికిత్స పొందారు. ఆర్థిక సహాయం కోసం వారు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పథకానికి దరాఖాస్తు చేసుకున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా సుమిత్రకు రూ.15 వేలు, గంగమ్మకు రూ.44 వేలు మంజూరైన చెక్కులను క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, హమాలీ శ్రీనన్న, శ్రావణ్‌, తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం..
రామంతాపూర్‌, మార్చి 23 : రామంతాపూర్‌ ఇందిరనగర్‌లో రమాసహిత సత్యనారాయణస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి ఆలయ ఈవో భాగ్యలక్ష్మి , చైర్మన్‌ కోట్ల నర్సింహారెడ్డి, ధర్మకర్తలు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఆలయ 48వ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డి. సీతారామాచార్యులు, సిబ్బంది మురళీధర్‌రావు, ఎన్‌. శంకర్‌, పలువురు ధర్మకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement