ఉప్పల్, జూలై 27 : కరోనా కష్టకాలంలో వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణతో పాటు, ప్రజలను కరోనా నుంచి కాపాడటంలో వైద్యసిబ్బంది అందించిన తోడ్పాటు హర్షణీయమన్నారు. హబ్సిగూడలోని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉత్తమ 10 మంది వైద్యసిబ్బందిని సత్కరించి, బహుమతులు అందజేశారు.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే.. బెస్ట్ కరోనా వారియర్స్ అవార్డును అందుకున్న సిబ్బందిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి, వాచ్‌లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసేవారికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ అందరికీ అందించేలా చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు డా.సౌందర్యలత, డాక్టర్ స్వప్నిక, సూపర్వైజర్ బోగ ప్రకాశ్, గొంగడయ్య, మంగమ్మ, శోభ, భగత్, నేతలు గరిక సుధాకర్, బద్రుద్దీన్, ముత్యంరెడ్డి, సూరం శంకర్, సాయి, తదితరు లు పాల్గొన్నారు.