గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Jun 25, 2020 , 23:41:18

మొక్కలే జీవనాధారం... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

మొక్కలే జీవనాధారం... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

మణికొండ: మొక్కలతోనే జీవనాధారమని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు.  నియోజకవర్గ పరిధిలోని బండ్లగూడ, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో హరితహారం కార్యక్రమాన్ని  గురువారం ఆయన ప్రారంభించారు. బండ్లగూడ కార్పొరేషన్‌ పరిధిలోని కిస్మత్‌పూర్‌, మణికొండ మున్సిపల్‌ పరిధిలోని అల్కాపూర్‌కాలనీ, నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మ ఆలయ ప్రాంగణంలో స్థానిక నాయకులతో  కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో బండ్ల గూడ మేయర్‌ మహేందర్‌గౌడ్‌,  నార్సింగి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రేఖ, వైస్‌చైర్మన్లు పాల్గొన్నారు.

శంషాబాద్‌: ఉద్యమంలా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సూచించారు.  గురువారం మల్కారంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించాలని సూ చిం చారు.  అధికారులు ప్రజలకు  అవగాహన కల్పించాలన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్వి రాజు, సర్పంచ్‌ మాధవి, సొసైటీ చైర్మన్‌ సతీశ్‌, ఎంపీడీవో జనార్దన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- మొక్కలు నాటి భావితరాలకు ఆదర్శంగా నిలువాలని  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి అన్నారు.  గురువారం మున్సిపాలిటీలో  మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోపాల్‌, కౌన్సిలర్లు  పాల్గొన్నారు.

పహాడీషరీఫ్‌: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జల్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్లా సాది, కౌన్సిలర్‌ ప్రశాంతి శ్రీధర్‌గౌడ్‌ కోరారు. గురువారం మున్సిపల్‌ పరిధిలోని శ్రీరామకాలనీలో, పెద్ద చెరువు సమీపంలో నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   మొక్కలే ప్రాణకోటికి జీవనాధారం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వో సుదర్శన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మోయిన్‌బాబా, సూపర్‌వైజర్లు కుమార్‌, హరినాథ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్కేపురం: మొక్కల పెంపకంతో భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్లవుతుందని టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌ తెలిపారు. స్థానిక ఖిల్లా మైసమ్మ ఆలయ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్‌ గొడుగు శ్రీనివాస్‌ ముదిరాజ్‌, నాయకులు మారోజు రామాచారి, కొండ్ర శ్రీనివాస్‌, పెంబర్తి శ్రీనివాస్‌, ముప్పిడి లింగస్వామిగౌడ్‌, న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, యాదవరెడ్డి, జాహెద్‌, వాజీద్‌ పటేల్‌, పబ్బు శ్రీనివాస్‌, నాగేందర్‌గౌడ్‌, రమేశ్‌గౌడ్‌, రమేశ్‌కుర్మ, శ్రీమన్నారాయణ, వెంకటేశ్‌గౌడ్‌, గిరిగౌడ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

హుడా కాలనీ పార్కులో.. 

హరితహారం కార్యక్రమంలో భాగంగా సరూర్‌నగర్‌ హుడా కాలనీ పార్కులో మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్‌ పారుపల్లి అనితా దయాకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్‌, డివిజన్‌ అధ్యక్షుడు ఆకుల అరవింద్‌ కుమార్‌, మహేశ్వరం యూత్‌ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, నాయకులు  సుదర్శన్‌, రాజేశ్‌గౌడ్‌, జంగారెడ్డి, రాఘవేంద్రగుప్తా పాల్గొన్నారు. 


logo