మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 08:50:22

వరదల కారణంగా నష్టపోయిన.. ప్రతి కుటుంబానికీ పరిహారం

వరదల కారణంగా నష్టపోయిన.. ప్రతి కుటుంబానికీ పరిహారం

కొండాపూర్‌, అక్టోబర్‌ 27 : వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ముంపు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నగదును మంగళవారం విప్‌ గాంధీ చందానగర్‌ డివిజన్‌ వేమన వీకర్‌ సెక్షన్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతిరెడ్డి, సునీతరెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్‌రెడ్డి, నాయకులు మిర్యాల రాఘవరావు, జెరిపాటి రాజు, గురుచరణ్‌ దూబే, గోవర్దన్‌రెడ్డి, జహీర్‌ స్థానికులు పాల్గొన్నారు. 

గచ్చిబౌలిలో..

ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని గచ్చిబౌలి డివిజన్‌ కార్పొరేటర్‌ కొమిరిశెట్టి సాయిబాబా పేర్కొన్నారు. మంగళవారం ఆయన డివిజన్‌ పరిధిలోని ఖాజాగూడలో వరదలతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు అందజేస్తున్న నగదును అందజేశారు. వరద ఇబ్బందులు ఎదురైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు బాధిత కుటుంబాల వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి నగదు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

శేరిలింగంపల్లిలో...

వరద బాధితులకు ఆర్థికసాయం పంపిణీ మంగళవారం శేరిలింగంపల్లి డివిజన్‌ పరిధిలోని తారానగర్‌, లింగంపల్లి, పాపిరెడ్డికాలనీ, సురభి కాలనీల్లో విప్‌ గాంధీ డివిజన్‌ కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌తో కలిసి బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం వీరేశం గౌడ్‌, నాయకులు రమేశ్‌, రాజు యాదవ్‌, వేణు, కొండల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీకళ, కోదండరాం, వెంకట్‌రెడ్డి, ఫర్వీన్‌, యాదాగౌడ్‌, గోపాల్‌, ప్రభుగౌడ్‌, ఆంజనేయులు యాదవ్‌, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. 

చందానగర్‌లో..

వరదలతో ఇబ్బందులు పడిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న నిధుల పంపిణీలో భాగంగా మంగళవారం చందానగర్‌ డివిజన్‌లో ముంపు బాధితులకు డివిజన్‌ కార్పొరేటర్‌ నవతారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముంపు బాధితుల వివరాలను రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సేకరిస్తున్నారని, నష్టపోయిన వారికి నగదును నేరుగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్‌ సర్కిల్‌ -21 ఉప కమిషనర్‌ సుధాంశ్‌ పాల్గొన్నారు. 

కొండాపూర్‌లో

 వరద బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని కొండాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ షేక్‌ హమీద్‌ పటేల్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల్లో ముంపు బాధితులకు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ.. వరదల్లో నష్టపోయిన తీవ్రతను బట్టి రూ. లక్ష, యాభై వేలు, పది వేల ప్రకారం అందజేస్తున్నట్లు తెలిపారు.  

వరద బాధితులకు ప్రభుత్వం తక్షణ భరోసా

మాదాపూర్‌: ఇటీవల ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల కారణంగా మాదాపూర్‌ డివిజన్‌ పరిధిలోని వడ్డెర బస్తీ, గుట్టబేగంపేట్‌, భిక్షపతినగర్‌, గోకుల్‌ ప్లాట్స్‌లతో పాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికావడంతో కార్పొరేటర్‌ వి. జగదీశ్వర్‌గౌడ్‌ జీహెచ్‌ఎంసీ అధికారులు ఏఈ ప్రశాంత్‌తో పాటు రెవెన్యూ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ప్రభుత్వం ప్రకటించిన రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి వారిని పరామర్శించారు.  

  గోకుల్‌ ప్లాట్స్‌లో వరద బాధితులకు..

మాదాపూర్‌ డివిజన్‌ పరిధిలోని గోకుల్‌ ప్లాట్స్‌లో వరద ముంపునకు గురైన బాధితులకు మాదాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌ స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ సహకారంతో రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల ఆదేశాల మేరకు ప్రకటించిన రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి శ్రీనివాస్‌, మురళి కృష్ణ నాయకులు శ్రీనివాస్‌, ప్రసాద్‌, సాంబయ్య, ఓ. కృష్ణ, శ్రీనివాస్‌, చంటి, దుర్గారావు, వెంకట్‌రావు పాల్గొన్నారు.