e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home హైదరాబాద్‌ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి చేకూరి

ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి చేకూరి

మియాపూర్‌, సెప్టెంబర్‌ 19 : ఉన్నత విలువలు ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన నేత చేకూరి కాశయ్య అకాల మరణం తనను ఎంతో కలచివేసిందని ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ అన్నారు. ఖమ్మం పట్టణంలో కమ్మవారి కల్యాణ మండపంలో జరిగిన మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌, తెలంగాణ అభ్యుదయ వాది చేకూరి కాశయ్య కాంస్య విగ్రహావిష్కరణ, పుస్తకావిష్కరణలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు, ఖమ్మం మేయర్‌ నీరజ సహా ఇతర ప్రముఖులతో కలిసి విప్‌ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్‌ గాంధీ మాట్లాడుతూ.. ఆయనతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన జీవితం ఎంతో మంది నేతలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్‌ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారంలో ముందుంటా

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ అన్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలనే నమ్ముకుని పని చేసిన ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం కరోనా భత్యం ఇచ్చి అండగా నిలబడ్డదన్నారు. శేరిలింగంపల్లి మండలం గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని రీటా ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన గురు పూజా మహోత్సవ కార్యక్రమానికి విప్‌ అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థలు తమ ఉనికిని కాపాడుకుంటూనే ప్రస్తుత పరిస్థితుల్లో సేవా దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని విప్‌ గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌, సంఘం ప్రతినిధులు భీష్మారెడ్డి, శ్రీనివాస్‌శంకర్‌, విజయకుమార్‌, పాపిరెడ్డి, ఎస్‌ఎన్‌రెడ్డి, రాంచందర్‌, ఏబీఎన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement