e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home హైదరాబాద్‌ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యం

అన్ని పండుగలకు సమ ప్రాధాన్యం

  • అరెకపూడి గాంధీబోనాల వేడుకలు
  • కమిటీలకు రూ.22.50 లక్షల చెక్కుల పంపిణీ

మియాపూర్‌, ఆగస్టు 2 : బోనాల వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా అంబరాన్నంటాయని, ఆనందోత్సాహాల నడుమ జరిగాయని ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలయాలకు నిధులను మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తున్నదన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా 73 దేవాలయాలకు మంజూరైన రూ. 22.50 లక్షల నిధులకు సంబంధించిన చెక్కులను ఆలయ కమిటీ ప్రతినిధులకు కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి సోమవారం వివేకానందనగర్‌లోని తన నివాసంలో అందించారు.

ఈ సందర్భంగా విప్‌ గాంధీ మాట్లాడుతూ.. ఈ వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా జరిగేందుకు అన్ని దేవాలయాలకు నిధుల మంజూరుకు తాను చేసిన కృషి ఫలించిందన్నారు. నిధుల మంజూరు పట్ల సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో అరుణకుమారి, పార్టీ నేతలు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌, జిల్లా గణేశ్‌, పెద్ద భాస్కర్‌రావు, సాంబశివరావు, పోతుల రాజేందర్‌, కాశీనాథ్‌ యాదవ్‌, రాంచందర్‌, ఆంజనేయులు, వాసు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కు అందజేత..

- Advertisement -

వివేకానందనగర్‌ డివిజన్‌ బాగ్‌మీర్‌కు చెందిన బసవరాజుకు సీఎం సహాయనిధి పథకం కింద మంజూరైన రూ. 36, 000 చెక్కును కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌, నార్నె శ్రీనివాసరావులతో కలసి ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ సోమవారం తన నివాసంలో బాధితుడికి అందించారు. ఈ సందర్భంగా విప్‌ గాంధీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఆర్థిక స్థోమత లేని పేదలకు ఈ పథకం కొండంత అండగా నిలుస్తున్నదన్నారు. ఆపద సమయంలో పేదలకు ఎంతో చేయూతనిస్తున్నదని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana