e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home హైదరాబాద్‌ అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు

అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు

  • విప్‌ అరెకపూడి గాంధీ
  • అర్హులకు రేషన్‌ కార్డుల పంపిణీ

మియాపూర్‌, జూలై 26 : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, ప్రతి పేదవాడి ఆకలి తీర్చి వారిని కండ్లలో పెట్టుకుని చూసుకుంటున్నారని ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వ చర్యలు పేదవారిలో ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని, తమకు అండగా ప్రభుత్వం ఉందన్న కొండంత ధైర్యం ప్రజలలో సంపూర్ణంగా నెలకొని ఉన్నదని అన్నారు. ఆల్విన్‌ కాలనీ డివిజన్‌లో నూతన ఆహార భద్రత కార్డులను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌, రోజాదేవి, తాసీల్దార్‌ గోవర్ధన్‌, డిప్యూటీ తాసీల్దార్‌ సంజీవరెడ్డి, ఏఎస్‌వో శ్రీనివాస్‌, ఆర్‌ఐ జగదీశ్‌లతో కలసి విప్‌ అరెకపూడి గాంధీ లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలెవరూ ఆకలితో బాధపడకుండా అర్హులందరికీ ఆహార భద్రత కార్డులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులను పేదలకు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నామన్నారు. అర్హులందరికీ కార్డులు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. రేషన్‌ దుకాణాల పనితీరును మరింతగా మెరుగు పరిచి పేదలకు సరుకులను అందుబాటులో ఉంచాలని విప్‌ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, జిల్లా గణేశ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, దొడ్ల రామకృష్ణ గౌడ్‌, సమ్మారెడ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్‌, కాశీనాథ్‌యాదవ్‌, జాన్‌, సామ్యూల్‌, భాస్కర్‌, మున్నా, వాసు, రాములు, మంజుల, కుమారి, స్వప్న, లక్ష్మి, మధులత, నిర్మలమ్మ, రేణుక, సురేఖ, దేవి పాల్గొన్నారు.

- Advertisement -

కొండాపూర్‌, జూలై 26: పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ.. అర్హులైన పేద ప్రజలకు రేషన్‌ కార్డులను అందింంచనున్నట్లు ఎమ్మెల్యే, విప్‌ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని కొత్తగూడ కమ్యూనిటీహాల్‌లో ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు హమీద్‌ పటేల్‌, మంజుల రఘునాథ్‌రెడ్డి, రాగం నాగేందర్‌ యాదవ్‌, జగదీశ్వర్‌గౌడ్‌లతో పాటు ఏఎస్‌ఓ బాల సరోజ, తాసీల్దార్‌ వంశీమోహన్‌తో కలిసి అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్‌ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయా డివిజన్లకు చెందిన అర్హులందరికీ రేషన్‌ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు చంద్రారెడ్డి, ఆయా డివిజన్ల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana