e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home హైదరాబాద్‌ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి

నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి

నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి

మియాపూర్‌ , జూలై 16 : సీఎం కేసీఆర్‌ మార్గదర్శనం మంత్రి కేటీఆర్‌ తోడ్పాటుతో నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ఇందుకోసం అహర్నిషలు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గం, ఐటీకి సింహభాగం కేంద్రంగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం నగరానికి, రాష్ర్టానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ప్రజలందరి భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని జేపీనగర్‌, అరబిందో కాలనీ రంగాపురం కాలనీల్లో రూ.43లక్షలతో ఓపెన్‌ నాలా పునరుద్ధరణ, వరద నీటి కాలువపై స్లాబ్‌ల నిర్మాణం, వరద నీటి కాలువ నిర్మాణ పనులకు కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌ జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా అభివృద్ధి ఆగకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారన్నారు.అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించాలన్నారు. పనులను నిత్యం పర్యవేక్షించాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఈ రూపాదేవి, ఏఈలు ధీరజ్‌, అనురాగ్‌,విశ్వనాథ్‌,జగదీశ్‌, ప్రేమ్‌, మాజీ కౌన్సిలర్‌ లక్ష్మీనారాయణ, పార్టీ నేతలు పురుషోత్తం ,మోహన్‌, గంగాధర్‌, గోపాల్‌రావు, కిరణ్‌, జనార్దన్‌, శ్రీనివాస్‌,సంతోష్‌, రాజు, విజయ్‌, వెంకటేశ్‌,శివ, మల్లేశ్‌, మహిళా నేతలు రోజా, సుప్రజ, న్యాన్సీ,కాలనీ వాసులు రాంబాబు, నారాయణరెడ్డి, బల్‌రెడ్డి, అభినవ్‌రెడ్డి, శ్రీనివాస్‌, రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్‌ సర్కిల్‌ కార్యాలయ ఆవరణలో 9 స్వచ్ఛ ఆటోలను డీసీ నందగిరి సుధాంశ్‌, కార్పొరేటర్లు మంజులా రఘునాథ్‌రెడ్డి, జగదీశ్వర్‌ గౌడ్‌, పూజిత గౌడ్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గాంధీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 637 మంది పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బంది బ్లాంకెట్లు, రెండు ఎల్‌ఈడీ బల్బులను అందజేశారు. ఈ సందర్భంగా విప్‌ గాంధీ మాట్లాడుతూ ఇండ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ కార్తీక్‌, శ్రీనివాస్‌, పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, పార్టీ నేతలు ప్రీతమ్‌,రవీందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, హరీశ్‌, జహీర్‌ఖాన్‌, ధనలక్ష్మి, వరలక్ష్మి, పార్వతి, భవానీ, మాధవి తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్‌ డివిజన్‌లో కమ్మ సంఘానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేయటాన్ని స్వాగతిస్తూ ఆల్విన్‌ కాలనీ డివిజన్‌కు చెందిన కమ్మసంఘం ప్రతినిధులు కమ్మవారి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రామకృష్ణ, రత్న ఈశ్వర్‌రావు, రత్నారావు, శ్రీనివాస్‌, మధు, ప్రభాకర్‌, శ్రీనివాస్‌రావు, హరిబాబు,రామకృష్ణ,నాగేశ్వర్‌రావు, వంశీ, మురళి, సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ దత్తాత్రేయనగర్‌కు చెందిన ప్రసన్నకుమార్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ. 3లక్షల చెక్కును కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాస్‌రావుతో కలిసి ఎమ్మెల్యే తన నివాసంలో అందించారు.

ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నివాసాలకు తాగునీటి వసతిని కల్పించాలని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. ఈనెలాఖరు వరకు పనులను పూర్తి చేసి నివాసితులకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నివాసాలకు తాగునీటి వసతిపై కూకట్‌పల్లి జలమండలి అధికారులతో విప్‌ గాంధీ శుక్రవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. తాగునీరు కలుషిత కాకుండా చూడాలని, దెబ్బతిన్న పైపుల స్థానంలో కొత్త వాటిని మార్చాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమావేంలో జీఎం ప్రభాకర్‌, డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజరు ఝాన్సీ, హౌసింగ్‌ ఈఈ వెంకటదాస్‌రెడ్డి, డీఈ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు..

కొండాపూర్‌, జూలై 16:ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన చందానగర్‌ సర్కిల్‌ -21 పరిధిలోని చందానగర్‌ డివిజన్‌లోని సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌లో వరద నీటి సమస్యలు తలెత్తకుండా రూ. 90లక్షలతో వరద నీటి కాలువ, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి, దీప్తిశ్రీనగర్‌ కాలనీ, తులిప్‌ రెసిడెన్సీలో వరద నీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ. 60లక్షలతో వరదనీటి కాలువ, రిటైనింగ్‌ వాల్‌ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్‌ మంజుల రఘునాథరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని నాలాల్లో పూడికతీతతో పాటు విస్తరణ పను లు 90 శాతం సైతం పూర్తైనట్లు తెలిపారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా రోడ్ల విస్తరణ సైతం పూర్తి చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో కార్పొరేటర్‌ శ్రీకాంత్‌, అధికారులు డీఈ రూపదేవి, ఏఈ ధీరజ్‌, ఏఈ అనురాగ్‌, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు విశ్వనాథ్‌, జగదీశ్‌, జగన్‌, మాజీ కార్పొరేటర్‌ అశోక్‌గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ నారాయణ గౌడ్‌, చందానగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, కరుణాకర్‌ గౌడ్‌, గోపికృష్ణ, వెంకటేశ్‌, ధనలక్ష్మి, వెంకటేశ్‌, రవీందర్‌రెడ్డి, ప్రీతమ్‌, రాజశేఖర్‌రెడ్డి, సీతారామయ్య, పూర్ణచందర్‌, కొండల్‌రెడ్డి, చంద్రశేఖర్‌,శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లమయ్య, సందీప్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నిఖిల్‌, హరీశ్‌, వరలక్ష్మి, భవాని, పార్వతి, మాధవి, సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌ వాసులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి

ట్రెండింగ్‌

Advertisement