e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home హైదరాబాద్‌ డ్రోన్‌ సాయంతో విత్తనాలు

డ్రోన్‌ సాయంతో విత్తనాలు

డ్రోన్‌ సాయంతో విత్తనాలు

మియాపూర్‌, జూలై 15 : హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి పచ్చదనాన్ని పెంచేందుకు యాంత్రికతను వినియోగించుకుంటున్నట్లు, దీనివల్ల మరిన్ని సత్ఫలితాలు వస్తాయని ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ అన్నారు. దోమల నివారణకు వినియోగించిన డ్రోన్లను సీడ్‌ బాల్స్‌ వెదజళ్లేందుకు వాడుతుండటం వల్ల పచ్చదనాన్ని మరింతగా విస్తృత పరచవచ్చునన్నారు. హైదర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని అలీ తలాబ్‌ చెరువులో డ్రోన్‌ సాయంతో సీడ్‌ బాల్స్‌ వెదజల్లే కార్యక్రమంలో కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, డీసీ ప్రశాంతి, కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్‌ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చదనంలో యాంత్రికతను వినియోగించటం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో మొక్కలు పెంచేందుకు అవకాశం కలుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువుల వద్ద ఈ తరహాలో సాంకేతికతను వినియోగించి పచ్చదనం పెంపుకు కృషి చేస్తామని విప్‌ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ రంగారావు, వైద్యాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, సత్యనారాయణ, పార్టీ నేతలు శ్రీనివాస్‌యాదవ్‌, దామోదర్‌రెడ్డి, పోతుల రాజేందర్‌, కృష్ణ, అష్రాఫ్‌, వెంకటేశ్‌, సత్యనారాయణ, బాలయ్య, ఖదీర్‌, షరీఫ్‌, యాసిన్‌, సుధాకర్‌రెడ్డి, అనీల్‌, మహిళా నేతలు కృష్ణకుమారి, విమల, స్వప్న, మాధవి, జ్యోతి, దుర్గ, పర్వీన్‌, హైమత్‌, బీజన్‌, రేణుక తదితరులు పాల్గొన్నారు.

సుందరీకరణ పనులు పరిశీలన..

వివేకానందనగర్‌ డివిజన్‌ పరిధిలోని వివేకానందనగర్‌ కమాన్‌ వద్ద జాతీయ రహదారి పక్కన రూ. 11 లక్షలతో చేపడుతున్న జంక్షన్‌ సుందరీకరణ పనులను జడ్సీ మమత, డీసీ ప్రశాంతి, కార్పొరేటర్‌ నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్‌ అరెకపూడి గాంధీ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విప్‌ గాంధీ మాట్లాడుతూ.. జాతీయ రహదారి పక్కన ఈ జంక్షన్‌ బాటసారులను ఆకర్షించేలా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమన్నారు. పరిమిత స్థలంలో సుందరవనంగా తయారు చేయాలని, పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా చూడాలని విప్‌ గాంధీ కోరారు. డివిజన్‌ ముఖ ద్వారం అత్యంత ఆకర్షనీయంగా మారటం తథ్యమని, ప్రజల సౌకర్యం పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ రంగారావు, వడ్డేపల్లి రాజు, శ్రీనివాస్‌యాదవ్‌, పోతుల రాజేందర్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డ్రోన్‌ సాయంతో విత్తనాలు
డ్రోన్‌ సాయంతో విత్తనాలు
డ్రోన్‌ సాయంతో విత్తనాలు

ట్రెండింగ్‌

Advertisement