హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ 17 ఏండ్ల బాలికపై ఆటోడ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. భీమ్ రాజ్(23) ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ.. తన ఇంటికి సమీపంలోని బాలికతో స్నేహం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందిరా నగర్‌లోని తన ఫ్రెండ్ రూమ్‌కు భీమ్ రాజ్ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇటీవలే భీమ్ రాజ్ నుంచి వేధింపులు ఎక్కువ అవడంతో బాధితురాలు తన జరిగిన అన్యాయంపై తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.