మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 25, 2020 , 12:51:17

ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తాం

ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తాం

  • ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే మీ గడపదాకా వచ్చాం
  • వరద బాధితులకు నగదు పంపిణీలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని

కంటోన్మెంట్‌ : ఎవరూ ఉహించని విపత్కర పరిస్థితి వ చ్చింది.. పండుగ వేళ పట్టెడన్నం తినే అదృష్టం లేకుం డా చేసింది.. ఇండ్లను ముంచేసింది.. కాలనీల్లోనే మాటువేసి జలప్రళయం సృష్టించింది. దీంతో జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తూ కరాళ నృత్యం చేసింది. కట్టుబట్టలతో ఉన్న ఇంటిని వదిలేసి ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితిని వరణుడు తీసుకొచ్చాడు. వరుణుడి కోపానికి గురై నిరాశ్రయులైన నగర జనానికి మేము అండగా ఉన్నామంటూ సర్కారు భరోసా ఇస్తుండటం గొప్ప విషయమని మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు అన్నారు. శనివారం కంటోన్మెంట్‌ పరిధిలో వరద ముంపునకు గురైన ఆరో వార్డు లక్ష్మీనగర్‌, ఒకటోవార్డు శివాలయం బస్తీల్లో వరద బాధితులకు స్థానిక ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు సభ్యులు జక్కు ల మహేశ్వర్‌రెడ్డి, పాండుయాదవ్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌లతో కలిసి మంత్రులు తక్షణ సాయం కింద రూ. 10వేల నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయని అన్నారు. దీంతో ఇండ్లలోకి నీళ్లు చేరి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సర్కారు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే నగదును అందజేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధితులకు అండగా నిలబడాలనే తపనతోనే మీ ఇంటి గడపదాక వచ్చామని భరోసా నిచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే అధికారుల నివేదిక ప్రకారం బాధితులు ఎవరు ఉన్నా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని మంత్రు లు హామీ ఇచ్చారు. ఇంట్లో సామగ్రితో పాటు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని కొందరు, తమ పేరును నమోదు చేసుకోలేదని మరికొందరు బాధితులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మంత్రులు అక్కడే అధికారులతో మాట్లాడి ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. వరదల వల్ల ఇబ్బందులకు గురైన వారిని అన్ని విధాలుగా అందరినీ ఆదుకుంటామన్నారు. కాలనీలలో పూర్తిస్థాయి సర్వే చేయించి ప్రతి బాధితుడికి పదివేలు, కేసీఆర్‌ కిట్టు అందే లా చూస్తామని తెలిపారు. అదే విధంగా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నామన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌తోపాటు ఉచిత  వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో తిరుమలగిరి తహసీల్దార్‌ మాధవిరెడ్డి, స్థానిక నేతలు ప్రభుగుప్తా, ఆసిన్‌, తారిఖ్‌, ఖాన్‌, ఇమ్రాన్‌, ఆప్రోజ్‌, సద్దాంతో పాటు అజయ్‌, విజయ్‌, బస్తీవాసులు పాల్గొన్నారు.

ఓట్లు కాదు ముఖ్యం.. ప్రజలే ప్రధానం

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిజాయితీని నిరూపించుకుంది. విపక్ష పార్టీలు నిత్యం ఎన్నికల కోసమే ప్రభు త్వం తాయిలాలు ఇస్తుందంటూ చేస్తున్న ఆరోపణలు పసలేనవని తేటతెల్లమైంది. శనివారం కంటోన్మెంట్‌ పరిధిలోని ఒకటో వార్డు శివాలయం బస్తీలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌లు వరద బాధితులకు నగదును అందజేశారు. అయితే అసలు విషయం తెలిస్తే ప్రతి ఒక్క రూ ఆశ్చర్యానికి గురవుతారు. ఇక్కడ నివసించే వారికి అసలు ఓట్లే లేవు. నిజం వీరికి ఈ ప్రాంతంలో ఓట్లే లేకపోవడం గమనార్హం. ఈ బస్తీలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. దీంతో  సర్కారు ఏమీ ఆలోచించకుండా వరద దాటికి గురై బాధితులుగా మిగలడంతో అందరికీ వరద సాయాన్ని అందజేసింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఓట్లు ముఖ్యం కాద ని, ప్రజలే ప్రధానమని ఈ సంఘటన స్పష్టం చేస్తున్నది. మరోవైపు ఈ బస్తీలో ఏ చిన్న సమస్య ఉన్నా బోర్డు సభ్యు డు జక్కుల మహేశ్వర్‌రెడ్డి తక్షణమే పరిష్కరిస్తూ ఉండటంపై స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.