ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తాం... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బేగంపేట: గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని.. లోతట్టు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్‌పేట, బేగంపేట డివిజన్లలోని ముంపు బారిన పడిన కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల పరిహారాన్ని ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముంపు ప్రాంత ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ మంచి మనస్సుతో స్పందించి వరద బాధితులకు ఆర్థిక చేయూత అందివ్వాలని ఆదేశించారన్నారు. ప్రతీ బాధితుడికి పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. ఇండ్లు కూలిన వారికి లక్ష, పాక్షికంగా ధ్వంసమైతే రూ.50 వేలు అందజేస్తామన్నారు. రాంగోపాల్‌పేట డివిజన్లోని నల్లగుట్ట, సీ, ఎఫ్ లైన్, బేగంపేటలోని బ్రాహ్మణవాడీ ప్రాంతాల్లోని బాధితులకు మంత్రి తలసాని నగదు పంపిణీ చేశారు.
ముంపు బాధితులకు నష్ట పరిహారం పంపిణీ కార్యక్రమం బుధవారం ముమ్మరంగా కొనసాగింది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధితుల ఇండ్లవద్దకే వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. రెండోరోజు దాదాపు 5000 మందికి రూ.10,000 చొప్పున నగదు పంపిణీ చేశారు. దీంతో బాధితులకు కొంత ఊరట లభిస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న సహాయంతో బాధితులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారు 1500 కాలనీలు ముంపునకు గురికాగా, దాదాపు 37,000 కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చాలామంది కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇండ్లకు వెళ్లి తలదాచుకున్నారు. ఇండ్లలోని వస్తువులు, ఆహార పదార్థాలు, బట్టలు తదితర అన్నీ తడిసి పాడయ్యాయి. దీంతో ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కింద నగదును పంపిణీచేస్తున్నది. గత మంగళవారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, మొదటిరోజు వర్షం కారణంగా పంపిణీకి అంతరాయం ఏర్పడింది. అయినా 744మందికి పంపిణీ చేయగా, బుధవారం మరో ఐదు వేలమందికి పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది తాత్కాలిక సహాయం మాత్రమేనని, నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నారు.
తాజావార్తలు
- మన సైకాలజీకి తగిన బొమ్మలు తయారు చేయండి..
- ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారం: మంత్రి పువ్వాడ
- ఐజేకేతో కూటమిగా ఎన్నికల బరిలోకి: నటుడు శరత్‌కుమార్
- క్రేజీ అప్డేట్ ఇచ్చిన మహేష్ బావ
- బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ఆఫీసుకు వ్యాపారవేత్త
- మేకను బలిచ్చిన పోలీస్.. సస్పెండ్ చేసిన అధికారులు
- జీవితంపై విరక్తితో విద్యార్థి ఆత్మహత్య
- ఫోన్ లాక్‌పై మాజీ భార్యతో గొడవ.. 15 కత్తిపోట్లు
- మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా
- పైన పటారం అనే సాంగ్‌తో అనసూయ రచ్చ