e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home హైదరాబాద్‌ విస్తరణ పనులు పూర్తిచేయాలి

విస్తరణ పనులు పూర్తిచేయాలి

విస్తరణ పనులు పూర్తిచేయాలి
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
  • లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచన

బేగంపేట్‌, మే 15: రాంగోపాల్‌పేట డివిజన్‌ పరిధిలో రాష్ట్రపతి రోడ్డులో నిర్మిస్తున్న నాలా వంతెన విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్‌ అధికారులతో కలిసి పనులను స్థానిక కార్పొరేటర్‌ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్‌ అరుణతో కలిసి పరిశీలించారు. వర్షాకాలం వరద తో స్థానిక వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, నాలాపై ఉన్న వంతెనను విస్తరించడం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి నిధులు మంజూరు చేయడంతో పనులు కూడా ప్రారంభించారు.

ప్రస్తుతం జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున ఈ రోడ్డుపై వాహనాల రద్దీ కూడా తక్కువగా ఉన్నందున పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఈఈ శివానంద్‌, జలమండలి జీఎం రమణారెడ్డి, మహంకాళి ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విస్తరణ పనులు పూర్తిచేయాలి

ట్రెండింగ్‌

Advertisement