e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home హైదరాబాద్‌ ఆగస్టు 1న పాతబస్తీ బోనాలు

ఆగస్టు 1న పాతబస్తీ బోనాలు

ఆగస్టు 1న పాతబస్తీ బోనాలు
 • ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
 • పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
 • అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ)/చార్మినార్‌ : ఆగస్టు 1న నిర్వహించనున్న పాతబస్తీ బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లు వెచ్చిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం సాలార్జంగ్‌ మ్యూజియంలో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ పాతబస్తీ బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఉత్సవాల నిర్వాహకులు, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనులు, భక్తులకు కనీస వసతులు తదితర 132 పనుల కోసం రూ.7 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలకు ప్రభుత్వం రూ.90 కోట్లను ఖర్చు చేస్తుండగా.., ఇందులో రూ.15 కోట్లు వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం కింద, మరో రూ.75 కోట్లు బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జోనల్‌ కమిషనర్‌ సామ్రాట్‌ అశోక్‌, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ, వాటర్‌ వర్క్స్‌ డైరెక్టర్‌ కృష్ణ, సీజీఎం వినోద్‌ భార్గవ, ట్రాన్స్‌ కో సీజీఎం స్వామి, డీసీపీ గజారావు, ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ రాములు నాయక్‌, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణ, ఐ అండ్‌ పీఆర్‌, సీఐఈ రాధాకృష్ణ, వైద్య, ఆరోగ్య శాఖ ఎస్‌పీహెచ్‌ఓ లక్ష్మణ్‌, పర్యాటక శాఖ ఎస్‌ఈ అశోక్‌, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశాలు

 • భక్తులకు తాగునీటిని అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
 • విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అదనపు ట్రాన్స్‌ ఫార్మర్‌లతో పాటు మొబైల్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌లను అందుబాటులో ఉంచాలి.
 • ఆలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 • రహదారుల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలి.
 • కరోనా నేపథ్యంలో శానిటైజేషన్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
 • ఆలయాల పరిసరాల్లో లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
 • భక్తులు ఉత్సవాలను వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయాలి.
 • జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేయాలి
 • బోనాల ఉత్సవాలు ముగిసే వరకు ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా అవసరమైన ప్రాంతాల్లో మరికొన్ని ఏర్పాటు చేయాలి.
 • భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ డైవర్షన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆగస్టు 1న పాతబస్తీ బోనాలు
ఆగస్టు 1న పాతబస్తీ బోనాలు
ఆగస్టు 1న పాతబస్తీ బోనాలు

ట్రెండింగ్‌

Advertisement