e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home హైదరాబాద్‌ పూడికతీత.. ముంపు ఉండదిక

పూడికతీత.. ముంపు ఉండదిక

పూడికతీత.. ముంపు ఉండదిక
  • 19 వరకు స్పెషల్‌ డ్రైవ్‌
  • ఫిర్యాదుల కోసం వాట్సాప్‌ నంబర్లు
  • బేగంపేట నాలాను పరిశీలించిన మంత్రి తలసాని

అమీర్‌పేట్‌, జూన్‌ 14: ముంపు సమస్యలు తలెత్తకుండా గ్రేటర్‌ పరిధిలోని నాలాల్లో పూడికతీత పనులు విస్తృతంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యదవ్‌ అన్నారు. రూ. 45 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని, 19 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను పర్యవేక్షించాలని కోరారు. సోమవారం బేగంపేట నాలాలో కొనసాగుతున్న పూడికతీత పనులను కార్పొరేటర్‌ మహేశ్వరి, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సీఈ దేవానంద్‌, ఎస్‌ఈ అనిల్‌రాజ్‌, ఈఈ శివానంద్‌, జలమండలి జీఎం రమణారెడ్డిలతో కలిసి పరిశీలించారు. బేగంపేట నుంచి బ్రాహ్మణవాడి వరకు నాలా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాలు చేపట్టాలని జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. దశాబ్దాల కిందట నిర్మితమైన ఈ నాలాలు ప్రస్తుత జనాభా, విస్తరిస్తున్న కాలనీల అవసరాలు తీర్చేందుకు అనుకూలంగా లేకపోవడంతో వీటిని అభివృద్ధి చేసే విషయంలో అధ్యయనాలు చేస్తున్నట్లు తెలిపారు. పూడికతీత పనులపై మంత్రి కేటీఆర్‌ నిరంతరం సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి తగిన ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారన్నారు.

ఫిర్యాదుల స్వీకరణకు వాట్సాప్‌ నంబర్లు..

గ్రేటర్‌ పరిధిలో జరుగుతున్న నాలా పూడికతీత పనులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే ప్రజలు ఆయా జోన్లకు సంబంధించిన జీహెచ్‌ఎంసీ అధికారులకు వాట్సాప్‌ నంబర్ల ద్వారా నివేదించవచ్చని మంత్రి తలసాని తెలిపారు. మంత్రి తలసాని కార్యాలయం 9848282309, జీహెచ్‌ఎంసీ మేయర్‌ కార్యాలయం 9030066666, సికింద్రాబాద్‌ జోన్‌ ఎస్‌ఈ అనిల్‌రాజ్‌ 9989930374, ఖైరతాబాద్‌ జోన్‌ ఎస్‌ఈ రత్నాకర్‌ 9491642490, ఎల్‌బీనగర్‌ జోన్‌ ఎస్‌ఈ అశోక్‌రెడ్డి 9849906733, చార్మినార్‌ జోన్‌ నుంచి నర్సింగ్‌రావు ఎస్‌ఈ 9704405314, శేరిలింగంపల్లి జోన్‌ ఎస్‌ఈ చిన్నారెడ్డి 9989930363, కూకట్‌పల్లి జోన్‌ ఎస్‌ఈ శంకర్‌ 8978026758, జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ 21111111లతో పాటు మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా కూడా ప్రజలు నాలా పూడికతీత పనులకు సంబంధించిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని మంత్రి సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పూడికతీత.. ముంపు ఉండదిక
పూడికతీత.. ముంపు ఉండదిక
పూడికతీత.. ముంపు ఉండదిక

ట్రెండింగ్‌

Advertisement