గురువారం 04 మార్చి 2021
Hyderabad - Feb 24, 2021 , 05:01:11

అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండ: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండ: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

కవాడిగూడ, ఫిబ్రవరి 23: పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, నిర్మాణ్‌ సంస్థ ఆర్గనైజేషన్‌, దిషా అండ్‌ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో వరదల్లో నష్టపోయిన పేదలకు రూ.2.50లక్షలతో పలు రకాల సామగ్రిని మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అండగా నిలుస్తూ పలు వృత్తి పరమైన పరికరాలు అందజేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేదలకు సహా యం చేయడం అభినందనీయమన్నారు. 

ఈ సందర్భంగా వరదల్లో నష్టపోయిన 50కుటుంబాలకు కుట్టు మిషన్‌లు, ప్లంబర్‌ మిషన్లు, మేస్త్రీ, కిరాణానికి సంబంధించిన వృత్తి పరికరాలు, వస్తువులను అందజేశారు. అనంతరం  ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్‌ఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ ఎస్‌. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 1300 వృత్తిపరమైన పరికరాలను పేదలకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పార్వతి, శివరాణి, నిర్మాణ్‌ సంస్థ డైరెక్టర్‌ వాహిద్‌, మయూర్‌, ముషీరాబాద్‌ విద్యామండలి ఉప విద్యాధికారి ఎం.సామ్యూల్‌ రాజ్‌, హెచ్‌ఎంలు నరేందర్‌యాదవ్‌, జావీద్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రత్నం, మున్వర్‌ చాంద్‌, ఎల్లయ్య పాల్గొన్నారు.

VIDEOS

logo