ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Nov 28, 2020 , 09:48:19

మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ముషీరాబాద్‌: గ్రేటర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వందకుపైగా సీట్లు సాధించి మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకోబోతున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అడిక్‌మెట్‌ డివిజన్‌లోని టీఆర్‌టీ క్వార్టర్స్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత పేదల బస్తీల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని, హైదరాబాద్‌ను అభివృద్ది వేగంగా సాగుతుందన్నారు. బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలిస్తే ఎం చేస్తారో ప్రజలకు చెప్పకుండా సెంటిమెంట్‌తో లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలువనున్నటు టీఆర్‌టీ క్వార్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు నేత శ్రీనివాస్‌, వీ సుధాకర్‌గుప్తా, గురుదీప్‌, టీఆర్టీ క్వార్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సంతాన్‌, నర్సింగ్‌, సంతోష్‌, అశోక్‌, రవి, నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo