బీజేపోళ్లకు ఓట్లడిగే అర్హత లేదు..

ఉప్పల్ : కరోనా విజృంభణ, లాక్డౌన్ సమయంలో ప్రజల కష్టసుఖాలు పట్టించుకోని వారు ఇప్పుడు ఇంటింటికొచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారని, అలాంటి వారిని అస్సలు నమ్మొద్దని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే రాజకీయ పగటి వేషగాళ్లు, విద్వేషాలు రెచ్చగొట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓటర్లకు సూచించారు. బీజేపీ నాయకులకు మాట్లాడే నైతిక హక్కులేదని, మహిళలు, శిశు సంక్షేమానికి ఆదుకోవడానికి ఆర్ధిక సాయం చేయమని అడిగినా రూపాయి ఇవ్వని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇవ్వాళ ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చిలుకానగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్‌కు మద్దతుగా మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడే బీజేపీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి, నగర అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. మంత్రి కేటీఆర్ రోడ్డుషోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిందని ఎద్దేవా చేశారు.
కాలనీల అభివృద్ధికి టీఆర్ఎస్ను గెలిపించాలి
కాలనీలు అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థి బన్నాల గీత ప్రవీణ్‌ముదిరాజ్ గురువారం ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజల కోసం పనిచేసే టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతివ్వాలని కల్యాణపురి ప్రాంతంలో అభ్యర్థించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు తప్పక నెరవేర్చేలా చూస్తామన్నారు. చిలుకానగర్ ప్రజలపై విశ్వాసం ఉందని, కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఆకట్టుకున్న మంత్రి ప్రచారం
మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం ఆకట్టుకుంది. ఇంటింటికెళ్లి ఓటర్లను పలుకరిస్తూ, చిన్నారులను ఎత్తుకొని ప్రచారం సాగించారు. కారు గుర్తుకు ఓటెయ్యాలని, బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్‌కు మద్దతుగా ఉండాలని కోరారు. ప్రతి కాలనీలో గడపగడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరిని మందలిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు.
తాజావార్తలు
- 22 ఏళ్లు..18 సార్లు...
- ఢిల్లీలో భారీగా మోహరించిన పోలీసులు..
- 12,689 మందికి కొత్తగా కరోనా వైరస్
- 153 మంది పోలీసులకు గాయాలు.. 15 కేసులు నమోదు
- 18 ఏండ్లు పాకిస్తాన్ జైల్లో భారతీయ మహిళ
- సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు
- ఇంటర్ తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ