వైశ్యుల సంక్షేమానికి పెద్దపీట: సబితాఇంద్రారెడ్డి

ఆర్కేపురం : వైశ్యుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, అందుకే సీఎం కేసీఆర్‌కు వైశ్యులు అండగా నిలవాల్సిన సమయం ఇదేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ హోటల్లో ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్ధి మురుకుంట్ల విజయభారతిఅరవింద్కు మద్దతుగా ఆర్యవైశ్యులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు వైశ్యుల సంక్షేమాన్ని విస్మరించాయని, సీఎం కేసీఆర్ వైశ్యులకు నామినేటేడ్ పదవుల్లో పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా మురుకుంట్ల విజయభారతికి అవకాశం ఇచ్చారని, ఆమెను గెలిపించుకోవలసిన బాధ్యత వైశ్యులదే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌గుప్త, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణగుప్త, తెలంగాణ రాష్ట్రం టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధగిరిధర్గుప్త, ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
- ఓటుహక్కు ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత