e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home హైదరాబాద్‌ మంచి నీటి సమస్య పరిష్కారానికి 32 కోట్లు

మంచి నీటి సమస్య పరిష్కారానికి 32 కోట్లు

మంచి నీటి సమస్య పరిష్కారానికి 32 కోట్లు
  • పది రోజుల్లో సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలి
  • మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేయాలి
  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బడంగ్‌పేట, జూలై 20 : ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనిచేస్తున్నారని, తుక్కుగూడ మున్సిపాలిటీలో మంచి నీటి సమస్య పరిష్కారానికి రూ. 32 కోట్లు కేటాయించామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో మంగళవారం నీటి సమస్యపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాటర్‌ పైపులైన్‌ లేని చోట పైపులైన్‌ వేయించాలన్నారు. కొత్త పైపులైన్‌ వేయించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయించాలని సూచించారు. పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. రావిర్యాల, ఇమామ్‌ గూడ, మాం ఖాలో రిజర్వాయర్‌లు నిర్మాణం చేయడానికి స్థల సేకర ణ చేయాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పైపులైన్‌ పనులను త్వరగా పూర్తి చేయించాల న్నారు. భవిష్యత్‌లో నీటి సమస్య రాకుండా ఉండటానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌ రెడ్డి, హెచ్‌ఎండబ్ల్యూస్‌ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, డీజీఎం గోవింద్‌ గౌడ్‌, మేనేజర్‌ గోపాల్‌, అధికారులు, కౌన్సిలర్‌లు తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శం

కందుకూరు, జూలై 20 : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను మండల కేంద్రంలోని మండల పరిషత్‌ సమావేశపు హాల్‌లో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం సీఎం కేసీఆర్‌ మానస పుత్రికని చెప్పారు. కల్యాణలక్ష్మి ద్వారా ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. గతంలో 18 సంవత్సరాలు నిండకున్నా వివాహాలు చేశారని, ఇప్పుడు 18 ఏండ్లు నిండిన తర్వాతనే వివాహం చేస్తున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 71కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురుసాని వరలక్ష్మి, వైఎస్‌ ఎంపీపీ శమంత ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, వైస్‌ చైర్మన్‌ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు కళమ్మ రాజు, ప్రభాకర్‌, జంగిలి పరంజ్యోతి, ఎర్రబైరు సదాలక్ష్మి పుల్లారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, మంద సాయిలు, శ్రీనివాస్‌, బాలమణి, మల్లారెడ్డి, భూపాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, నాయకులు, అధికారుల పాల్గొన్నారు.

బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

- Advertisement -

కందుకూరు/ఆర్కేపురం జూలై 20 : సీఎం కేసీఆర్‌ మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం బక్రీ ద్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ స్ఫూర్తితో పేదలను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాల న్నారు. పండుగను కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జరుపు కోవాలని సూచించారు. కరోనా నుంచి విశ్వమానవాళి రక్షణ కోసం ప్రార్థించాలని మంత్రి కోరారు.

మహిళలు స్వయం కృషితో ఎదగాలి

మహేశ్వరం, జూలై 20 : మహిళలు స్వయం కృషితో ఎదగాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తుమ్ములూరు గ్రామంలో డ్వాక్రా సంఘం సభ్యులు ఏర్పాటు చేసుకున్న బ్యాంగిల్స్‌, పచ్చళ్లు, మొబైల్‌ క్యాంటీన్‌లను సర్పంచ్‌ సురేఖతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం లో డీఆర్‌డీఏ ప్రభాకర్‌, ఏపీఏం సత్యనారాయణ, వార్డు సభ్యులు కటికెల శ్రీహరి, శ్రీధర్‌రెడ్డి, గోవర్ధన్‌, పద్మ మహిళా సంఘం సభ్యులు కవిత, లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మంచి నీటి సమస్య పరిష్కారానికి 32 కోట్లు
మంచి నీటి సమస్య పరిష్కారానికి 32 కోట్లు
మంచి నీటి సమస్య పరిష్కారానికి 32 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement