e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home హైదరాబాద్‌ ముంపు కాలనీల్లో సహాయక చర్యలు

ముంపు కాలనీల్లో సహాయక చర్యలు

ముంపు కాలనీల్లో సహాయక చర్యలు
  • మ్యాన్‌ హోల్స్‌ను క్లీన్‌ చేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది
  • రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు తొలగింపు
  • చెరువులు, కుంటల్లోకి భారీగా చేరుతున్న వర్షపు నీరు

బడంగ్‌పేట, జూలై 15 : బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వరద ముంపు కాలనీల్లో సహాయక చర్యలు చేపట్టారు. బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్‌పేట మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహ న్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, ఇబ్రాం శేఖర్‌, కమిషనర్‌ సుమన్‌రావు, కృష్ణ మోహన్‌రెడ్డి, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వరద నీరు పోవడానికి ముంపు ప్రాంతాల్లో జేసీబీల సహాయంతో కాల్వలు తీయిస్తున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బందితో మ్యాన్‌హోల్స్‌, గల్ఫర్‌తో డ్రైనేజీ పైపులు క్లీన్‌ చేయిస్తున్నారు. విరిగి పడిన చెట్లను ఏఈ భాస్కర్‌ దగ్గర ఉండి తొలగిస్తున్నారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పాడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

వరద కాల్వలకు అడ్డంగా ఉన్న వాటిని తొలగిస్తున్నారు. అంటూ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. ముంపు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సాయి బాలాజీ హోమ్స్‌, సీతాహోమ్స్‌, నవయుగ కాలనీ, బీమిడి కాలనీ, శివనారాయణపురం, సాయి టౌన్‌షీప్‌, రామిడి మల్లారెడ్డి కాలనీ, బోయపల్లి ఎన్‌క్లెవ్‌, న్యూ మదురానగర్‌, సౌభాగ్య కాలనీ, గ్రీన్‌ హోమ్స్‌, లక్ష్మీనగర్‌, రాఘవేంద్ర హోమ్స్‌, తదితర కాలనీలు మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మిథీలానగర్‌, సత్యసాయి నగర్‌, కమలానగర్‌, శ్రీధర్‌కాలనీ, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, వెంకటేశ్వర కాలనీలో వరద ముంపునకు గురి కావడంతో అధికారులు సహయక చర్యలు చేపడుతున్నారు. ప్రజ లు అప్రమత్తంగా ఉం డాలని అధికారులు సూచిస్తున్నారు.

మండలంలో మోస్తరు నుంచి భారీ వర్షం

- Advertisement -

కందుకూరు, జూలై 15 : ఆల్ఫాపీడన ప్రభావంతో మండల వ్యాప్తం గా నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక లు పొంగిపోర్లుతున్నాయి. చెరువుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతున్నది. మండలంలో 39.5 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలు గ్రామాల్లో భారీ వర్షాలకు చెరువులు నిండి జళకళ సంతరించుకున్నాయి. ప్రభుత్వం ముందు చూపు తో మిషన్‌కాకతీయ పథకంతో చెరువులు కుంట ల్లో పూడికతీత వల్ల వర్షపు నీరు అందులోకి చేరుతుంది. మండల పరిధిలోని జైత్వారం, పులిమామిడి, దన్నారం, తదితర గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండి ప్రవహిస్తున్నాయి.

అట్టి నీరు కొత్తగూడ సున్నం చెరువులోకి చేరుతున్నది. ఆ చెరువు నుంచి కొత్తూరు వాగులోకి ప్రహహించి ఇబ్రహీంపట్నం చెరువులోకి చేరుతాయి. అదే విధంగా తిమ్మాపూరు, రాచులూరు, గుమ్మడవెల్లి, ఆకులమైలారం, మీర్‌ఖాన్‌పేట్‌ గ్రామాల్లోని పెద్ద చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతున్నాయి. వర్షపు నీటితో చెక్‌ డ్యాంలు సైతం నీటితో నిండా యి. కొన్ని గ్రామాల్లోని చెరువులు నిండి అలుగు లు పారుతున్నాయి. చెరువులు కుంటల్లో వర్షపు నీరు నిండి ప్రవహిస్తుండడంతో ప్రజలు సంతో షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

పహాడీషరీఫ్‌, జూలై 15 : భారీ వర్షాల కురుస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. బుధవారం జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన ఉస్మాన్‌నగర్‌, వాది ఏ హుదా, నబిల్‌ కాలనీ, అమ్రీన్‌కాలనీలో గురువారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి కాలనీ, బస్తీల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.

భవిష్యత్‌లో ముంపు సమస్యలు తలెత్తకుండా గత సంవత్సరం రూ. 50లక్షలు వెచ్చించి బురాన్‌ఖాన్‌ చెరువు తూము నుంచి ఔట్‌లెట్‌ ఏర్పాటు చేయించి ఎక్కువైన నీటిని బయటకి పంపించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం చెరువు వెనకవైపు ఉన్న కట్టను రూ. 30లక్షల నిధులతో అభివృద్ధి చేయిస్తున్నామన్నారు. బుధవారం రాత్రి భారీ వర్షంలో సైతం చైర్మన్‌ అబ్దుల్లా సాది, కమిషనర్‌ కుమార్‌ ప్రజలకు అందుబాటు లో ఉండి మున్సిపల్‌ ప్రత్యేక సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారని వారిని అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్లా సాది, కమిషనర్‌ కుమార్‌, ఏఈ కిష్టయ్య, కౌన్సిలర్లు మజర్‌ అలీ, శంషొద్దీన్‌, అహ్మద్‌ కసాడి, జింకల రాధిక శ్రావణ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఇక్భాల్‌ బిన్‌ ఖలీఫా, యూసుఫ్‌ పటేల్‌, షేక్‌ అప్జల్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముంపు కాలనీల్లో సహాయక చర్యలు
ముంపు కాలనీల్లో సహాయక చర్యలు
ముంపు కాలనీల్లో సహాయక చర్యలు

ట్రెండింగ్‌

Advertisement